Breaking News

మిలాన్‌ రిహార్సల్స్‌ అదుర్స్‌

Published on Wed, 02/21/2024 - 05:52

బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): భారీ యుద్ధ నౌకలు... స్పీడు బోట్లు.. ఫైటర్‌ జెట్స్‌... యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ తీరం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. మిలాన్‌–2024లో భాగంగా విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో మంగళవారం నిర్వహించిన ఫైనల్‌ రిహార్సల్స్‌ అద్భుతంగా సాగాయి. భారీ యుద్ధ నౌకలు, స్పీడ్‌ బోట్లు, ఫైటర్‌ జెట్స్, యుద్ధ విమానాలు తీరంలో తమ ప్రతిభను ప్రదర్శించాయి. ఇందులో భాగంగా హెలికాప్టర్‌ ద్వారా ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించటం, తీవ్రవాదుల దాడులను ఎదుర్కొవడం వంటి అంశాలను ప్రదర్శించారు.

అనంతరం మిగ్, హక్స్, ఫైటర్‌ జెట్స్‌ తీరంలో బాంబులను వెదజల్లుతూ అబ్బురపరిచాయి. అదే సమయంలో ఆకాశం నుంచి ఆరుగురు సైనికులు జాతీయ పతాకం, నేవీ పతాకం పట్టుకుని పారాచూట్‌ ద్వారా కిందికి దిగారు. వారు ఒక బహుమతిని ముఖ్య అతిథికి అందజేశారు. నేవీ స్కూల్‌ విద్యార్థుల నృత్య ప్రదర్శన, జాతీయ గీతాల ప్రదర్శనలు అలరించాయి. అనంతరం దేశ రక్షణ బలగాలు, రాష్ట్ర రక్షణ బలగాలు, విదేశీ నేవీ బలగాలు, రాష్ట్ర సంప్రదాయ కూచిపూడి, థింసా, కోయ నృత్యాలు, సంక్షేమ పథకాల నమూనాలతో భారీ పరేడ్‌ నిర్వహించారు.

ఈ నెల 22వ తేదీన తుది పరేడ్‌ను నిర్వహించనున్నారు. కాగా, పరేడ్‌ ఫైనల్‌ రిహార్సల్స్‌ చూసేందుకు విశాఖ నగర వాసులు పెద్ద సంఖ్యలో తీరానికి చేరుకున్నారు. ఆర్కే బీచ్‌ నుంచి కురుసుర మ్యూజియం వరకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు సందర్శకులతో కిటకిటలాడాయి. ఈ రిహార్సల్స్‌ను చూసేందుకు నేవీ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు