Breaking News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న సురక్ష లక్ష్యం

Published on Sun, 07/02/2023 - 05:03

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హత ఉన్న 99 శాతం మందికి సంక్షేమ పథకాలను సీఎం వైఎస్‌ జగన్‌ అందించారని.. సాంకేతిక కారణాలతో లబ్ధి పొందని ఒక శాతం లబ్ధిదారులకు కూడా ప్రయో­జనం చేయాలన్న లక్ష్యంతోనే ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ చెప్పా­రు.

శనివారం రాష్టవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లా­డారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మం­డలానికి రెండు చొప్పున 1,305 సచివాల­యాల్లో క్యాంపులు నిర్వహించారని తెలిపారు. లబ్ధిదారులకు అవసరమైన ధ్రువపత్రాలను అక్కడికక్కడే అధికారులు జారీ చేశారని వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే...

దేశ చరిత్రలో ఇదే ప్రథమం: మంత్రి మేరుగు  
కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ రూపంలో రూ.2.23 లక్షల కోట్లను జమ చేశారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన దాఖలాలు లేవు. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే.. వారికి లబ్ది చేకూర్చడానికి అవసరమైన సర్టిఫికెట్లు ఉచితంగా జారీ చేయడం,  వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.

వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, గృహసా­రథులు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి.. వారి సమస్యలను తెలుసుకుని టోకెన్లు ఇస్తారు. శనివారం నుంచి ఈ నెల 30 వరకూ సచివాలయాల పరిధిలో క్యాంపులు నిర్వహించి.. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీ, పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం వంటి సమస్యలను మండల, సచివాలయ అధికారులు దగ్గరుండి పరిష్కరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.  

అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారు 
ఎక్కడైనా మాకు సమస్యలు ఉన్నాయని ప్రజలు అధికారుల వద్దకు వస్తారు. కానీ.. సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం అధికారులనే ప్రజల వద్దకు పంపి వారి సమస్యలు ఏమిటో తెలుసుకుని పరిష్కరించేలా క్యాంపులు ఏర్పాటు చేయడం సుపరిపాలనకు తార్కాణం.  ఈ నెలలోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తారు కాబట్టి వారికి కావాల్సిన సర్టిఫికెట్లను ముందుగానే ఇవ్వడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు ఆగస్టు నుంచే సంక్షేమ పథకాల క్యాలెండర్‌ కూడా అమలవుతుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)