Breaking News

ఆర్టీసీ ఉద్యోగులపై అవాస్తవాలేల!

Published on Wed, 11/15/2023 - 05:08

సాక్షి, అమరావతి: పచ్చ పత్రిక ఈనాడుకు, దాని అధినేత రామోజీరావుకు ఒకటే ఎజెండా.. నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఏదో ఒక రూపేణా విషం చిమ్మడమే. ఇందులో భాగంగానే ‘ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంతో సర్కారు చెలగాటం’ అంటూ అవాస్తవాలతో ఒక కథనాన్ని మంగళవారం ఈనాడులో వండివార్చారు. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీ­నం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సాహసించలేదు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ఇదంత సులువైన పని కాదని అక్కడ చేతులెత్తేశారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చాలా సులువుగా 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ­ంలో విలీనం చేశారు. తద్వారా వారికి ప్రభుత్వ ఉద్యో­గు­లకు లభించినట్టే అన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌)ను ఆర్టీసీ ఉద్యోగు­లకు కూడా వర్తింపజేశారు.

ఆర్టీసీ ఉద్యోగులు తమకు అనారో­గ్యం కలిగితే ఈహెచ్‌ఎస్‌ కింద రాష్ట్రంలో మెరుగైన వైద్యం పొందుతు­న్నారు. అయినా ఇదంతా కళ్లుండి కూడా చూడ­లేని కబోధి రామోజీరావు యథేచ్ఛగా విషం కక్కారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ కింద వైద్యం దక్కడం లేదంటూ అవాస్తవాలను అచ్చేశారు. అసలు వాస్తవాలేవో వివరిస్తూ ఈ ఫ్యాక్ట్‌ చెక్‌..

♦ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఈహెచ్‌ఎస్‌ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం అందిస్తున్న అన్ని రిఫరల్‌ ఆస్పత్రుల్లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా నాణ్యమైన వైద్య సేవలు పొందుతున్నారు. ఎంతోమంది ఉద్యోగులు ఆ సేవలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. 

♦ఈహెచ్‌ఎస్‌ రిఫరల్‌ ఆస్పత్రుల్లోనే కాకుండా 21 ఆర్టీసీ ఆస్పత్రుల్లో కూడా ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఓపీ, చికిత్స విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ప్రతి జిల్లాకు ఒక సమన్వయ అధికారిని నియ­మించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందితే.. ఆ మేరకు బిల్లులను ఈహెచ్‌ఎస్‌ పోర్టల్‌లో సమర్పించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. 

♦ఆర్టీసీ ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కార్డియాక్‌ కేర్‌ ట్రై–ఓఆర్‌జీ మెషిన్ల ద్వారా గుండెపోటు సమస్యను ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందిస్తున్నారు. ఆ విధంగా ఇప్పటివరకు 149 మందికి గుండెపోటు నివారణ చికిత్స అందించారు. 

♦ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే మౌలిక వస­తులను ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంది. 5 రకాల వైద్య సేవలు అందించే వైఎస్సార్‌ ఆర్టీసీ ఏరియా ఆస్పత్రిని కడపలో 2021­లోనే నెలకొల్పింది. అనంతపురం, రాజమండ్రిలో ఆర్టీసీ డిస్పె­న్స­రీలు ఏర్పాటు చేశారు. తిరుపతి, నర­సరా­వు­పేట, మచి­లీపట్నంలలో కొత్త­గా ఆర్టీసీ ఆస్పత్రు­ల నిర్మాణా­న్ని చేపట్టా­రు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)