Breaking News

ఆస్పత్రుల్లో హాహాకారం

Published on Mon, 07/13/2026 - 04:10

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఏఐ డాక్టర్లను తీసుకొస్తాం.. టెక్నాలజీతో రోగాలను మాయం చేస్తాం...!’ అంటూ పిట్టల దొరలా సీఎం చంద్రబాబు చెబుతున్న కబుర్లకు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వాస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులకు పొంతన లేకుండా ఉంది. అనారోగ్యం బారిన పడి ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తున్న నిరుపేద రోగులకు ఉచితంగా మందులు అందించకుండా బాబు సర్కార్‌ చేతులెత్తేస్తోంది. మందులు, సర్జికల్స్‌ బయట కొనుక్కోవాలంటూ ఆస్పత్రుల్లో చీటీలు రాసి పంపేస్తున్నారు. 

గత రెండేళ్లుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఇదే దుస్థితి నెలకొంది. రోజు రోజుకు సమస్య విషమిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పెద్దాస్పత్రుల్లో సెలైన్, ఇంజెక్షన్‌ ఇచ్చేందుకు వినియోగించే ఐవీ క్యాన్యులా, సర్జికల్‌ గ్లౌజులు, సెలైన్‌ సెట్లు, కాటన్, బ్యాండేజ్‌ లాంటి ప్రాథమిక పరికరాలకూ తీవ్ర కొరత ఏర్పడిందని వైద్యులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏది? 
మందులు, సర్జికల్స్‌ను ప్రభుత్వం పూర్తిస్థాయిలో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌(సీడీసీ)లలో అందుబాటులో ఉంచడం లేదు. ఆస్పత్రుల నుంచి ఇండెంట్‌ పెట్టిన మందులు, సర్జికల్స్‌  ఫార్మసీ కౌంటర్‌లలో లభ్యం కావడం లేదు. అన్ని జీజీహెచ్‌లలో సర్జికల్స్‌కు కొరత తీవ్రంగా ఉన్నట్లు ఫిర్యాదులున్నాయి. సర్జరీ, అనస్థీషియా లాంటి వివిధ విభాగాల నుంచి రోజువారీ అవసరాల కోసం పెడుతున్న ఇండెంట్‌లో 10–20 శాతం మేర మాత్రమే ఇస్తున్నారని ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్‌ వైద్యుడు తెలిపారు.

రోగులకు మత్తు ఇవ్వడం కోసం వాడే థెమిస్‌ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన బ్యూపివాకైన్‌ వాడకాన్ని ఇటీవల నిషేధించారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఔషధం అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొద్ది నెలలుగా సర్జికల్‌ గ్లౌజ్‌లు సైతం సరిపడా సరఫరా కావడం లేదని పలువురు సూపరింటెండెంట్‌లు వెల్లడించారు. కొన్ని రకాల సర్జికల్స్‌ ఆన్‌లైన్‌లో సీడీఎస్‌లో ఉన్నట్లు కనిపించినా ఇండెంట్‌ పెడితే మాత్రం సరఫరా కావడం లేదని తెలిపారు. 

సగం మందులు, సర్జికల్స్‌ నిల్‌ 
పెద్దాస్పత్రుల్లో 712 రకాల మందులు, 377 రకాల సర్జికల్స్‌ అందుబాటులో ఉండాలి. అయితే వీటిలో సగం కూడా లభ్యం కాని దుస్థితి దాపురించింది. మెజార్టీ సీడీసీల్లో 300 నుంచి 400 లోపు రకాల మందులే అందుబాటులో ఉంటున్నాయి. 100 రకాల వరకు సర్జికల్స్‌ ఉండటం లేదు. అందుబాటులో ఉన్న మందులు, సర్జికల్స్‌ సైతం ఆస్పత్రుల అవసరాలకు సరిపడా లేవు. సుమారు వంద రకాలకుపైగా మందులు, 50 రకాలకుపైగా సర్జికల్స్‌ నిల్వలు నామమాత్రంగా ఉన్నాయి. 

మందులు, సర్జికల్స్‌ కోసం ఆస్పత్రుల నుంచి వేల సంఖ్యలో ఇండెంట్‌లు పెడుతుంటే వందల్లో కూడా సరఫరా కావడం లేదు. అజిత్రోమైసిన్, అమోక్సలిన్, ఐవీ ఫ్లూయిడ్స్, ఆక్సిటోసిన్, ఐ–డ్రాప్స్, హీమోఫీలియా బాధితులకు అవసరమైన ఫ్యాక్టర్‌ ఇంజెక్షన్‌లకు జీజీహెచ్‌ల్లో కొరత ఉందని ఫిర్యాదులున్నాయి. హైబీపీ, తీవ్రమైన షుగర్‌ జబ్బు బాధితులకు ఇచ్చే ఖరీదైన మందుల సరఫరా లేకపోవడంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. 

మందుల బడ్జెట్‌కు కోత 
2024లో చంద్రబాబు సర్కార్‌ గద్దెనెక్కిన నాటి నుంచి ప్రభుత్వ వైద్యరంగం పరిస్థితి పూర్తిగా తారుమారు అయింది. 2014–19 మధ్య టీడీపీ సర్కార్‌ మందుల కోసం కేవలం రూ.216 కోట్లు విదల్చగా ఆ బడ్జెట్‌ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.700 కోట్లకు తీసుకెళ్లింది. తిరిగి గద్దెనెక్కిన బాబు సర్కారు బడ్జెట్‌ను తగ్గించాలని వైద్య శాఖపై ఒత్తిడి చేస్తోంది. 

దీంతో మందుల బడ్జెట్‌ తగ్గించాలని సూపరింటెండెంట్‌లను ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. 2025–26 ఆరి్థక సంవత్సరానికి మందుల కోసం రూ.200 కోట్ల అదనపు నిధులు ఇవ్వాలని కోరినా ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా విదల్చలేదు. బడ్జెట్‌ లేకపోవడంతో జనవరి నుంచి మందుల కొనుగోళ్ల ప్రక్రియపై ప్రతికూల ప్రభావం పడుతూ వచ్చింది. ఆ సమస్య తీవ్రతరమై ప్రస్తుతం ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్‌కు కటకటలాడుతున్న పరిస్థితి ఏర్పడింది. 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?