Breaking News

వైద్యశాఖ బదిలీల్లో గందరగోళం

Published on Tue, 06/03/2025 - 04:50

సాక్షి, అమరావతి: వైద్యశాఖలో బదిలీల కోసం శనివారం జారీచేసిన మార్గదర్శకాలు ఉద్యోగులను గందరగోళపరుస్తున్నాయి. రెండేళ్ల సర్విసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం కల్పించారు. ఐదు ఆప్షన్లను ఎంచుకోవాలని సూచించారు. అయితే, రిక్వెస్ట్‌ ట్రాన్స్‌­ఫర్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల స్థానాలను ఖాళీలుగా ప్రకటిస్తారా? ఎంచుకున్న ఐదు స్థానాల్లో ఖాళీలేని పక్షంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి బదిలీ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత లేకపోవడంతో రెండేళ్ల సర్విసు పైబడిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలా వద్దా అనే అయోమయం నెలకొంది.

మరోవైపు.. బదిలీ దరఖాస్తుల సమర్పణకు మంగళవారం తుది గడువు విధించారు. అయితే, సోమవారం సాయంత్రానికి కూడా అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో ఖాళీల వివరాలను ప్రదర్శించనేలేదు. దీంతో ఖాళీల వివరాలు చెప్పకపోతే దరఖాస్తు చేసుకునేదెలా అని వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా డీఎంఈ పరిధిలోని రాష్ట్రస్థాయి కేడర్‌ అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్‌ ఖాళీల వివరాలను సోమవారం సాయంత్రం వరకూ ప్రకటించలేదు. మీకేమైనా సమాచారం ఉందా అంటూ వైద్యులందరూ తాము పనిచేస్తున్న కళాశాలల ప్రిన్సిపాల్స్‌ కార్యాలయాల చుట్టూ సోమవారం ప్రదక్షిణలు చేశారు.  

ఖాళీలు చూపకపోవడంపై ఆరోపణలు.. 
ఐదేళ్లు సర్వీసు పూర్తయినప్పటికీ కొందరు వైద్యులు, ఇతర ఉద్యోగులు తాము పనిచేస్తున్న కార్యాలయాల్లోని పరిపాలన సిబ్బంది, బాస్‌లను మేనేజ్‌ చేసుకుని తమ స్థానాలను ఖాళీలుగా చూపకుండా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐదేళ్లు పైబడిన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌) జాబితాలో కొన్ని స్థానాలు పొందుపరచలేదని తెలుస్తోంది.

ఐదేళ్లు పైబడినప్పటికీ తిరుపతి రుయా, విశాఖ కేజీహెచ్‌లలో ముగ్గురు సీఏఎస్‌ స్థానాలను ఖాళీగా చూపలేదని వైద్యుల నుంచి ఫిర్యాదులున్నాయి. మిగిలిన కేడర్లలోనూ ఇదే తంతు నడుస్తోంది. ఇక గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వేల సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్‌ అయ్యారు. వీరి సీనియారిటీని రెగ్యులరైజ్‌ అయిన నాటి నుంచి పరిగణనలోకి తీసుకుంటారా? లేక మరేదైనా నిబంధనలున్నాయా అనే ప్రస్తావన కూడా చేయకపోవడంతో వీరంతా కూడా అయోమయానికి గురవుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)