Breaking News

మార్కెట్‌ యార్డుల్లో విద్యుత్‌ ఆదాకు చర్యలు

Published on Mon, 09/11/2023 - 04:21

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు మార్కెట్‌ యా­ర్డు­ల్లో ఇంధన సామర్థ్య చర్యల ద్వారా విద్యుత్‌ను, డబ్బును ఆదా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావి­స్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. గుంటూరు యార్డును ఆసియాలోనే అతిపెద్ద విద్యు­త్‌ ఆదా మిర్చి వ్యాపార కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌­(ఈఈఎ­స్‌ఎల్‌) రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖతో భాగ­స్వామి అయ్యేందుకు అంగీకరించింది. రాష్ట్రంలోని మరి­కొన్ని కీలక మార్కెట్‌ యార్డుల్లో కూడా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయనుంది.

వ్యవ­సాయ వాణిజ్యానికి మార్కెట్‌ యార్డులు కీలక కేంద్రాలు. ఇక్కడ లైటింగ్, శీతలీకరణ, ప్రాసెసింగ్, లాజిస్టిక్స్‌ కోసం విద్యుత్‌ను ఎక్కువగా వినియో­గిస్తుంటారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వీటిని విద్యు­త్‌ పొదుపు కేంద్రాలు­గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో–ఆపరేటివ్‌ శాఖ ప్రిన్సి­పల్‌ సెక్రట­రీ చిరంజీవితో ఈఈఎస్‌ఎల్‌ కమ్యూని­కేషన్స్, మార్కెటింగ్‌ సీజీఎం అనిమేష్‌ మిశ్రా ఆది­వారం భేటీ అయ్యారు.

విద్యుత్‌ ఆదా చర్యలకు సంబంధించి­న నివేదికను చిరంజీవికి అందజేశారు. అనంతరం ఈఈఎస్‌ఎల్‌ అధికారులు, మార్కెటింగ్, సహ­కార శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చిరంజీవి మాట్లాడారు. తొలుత గుంటూరు మిర్చి యార్డులో ఇంధన సామర్థ్య చర్యలు అమలు చేస్తా మన్నారు. ఈఈఎస్‌ఎల్‌ ప్రతినిధులు నితిన్‌ భట్, సావిత్రి సింగ్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ రాహుల్‌ పాండే, ఆప్కాబ్‌ ఎండీ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)