Breaking News

ఏమనుకుంటున్నావ్‌.. నన్నే పక్కకెళ్లమంటావా?

Published on Mon, 01/26/2026 - 05:02

సాక్షి, విశాఖపట్నం: ‘నేను నగర ప్రథమ పౌరుడిని. నన్ను కూర్చున్నచోట నుంచి లేపి పక్కకెళ్లమంటావా.. ఏమనుకుంటున్నావ్‌.. అసలేం మాట్లాడుతున్నావ్‌.. ప్రొటోకాల్‌ గురించి తెలీదా.. నేను ఈ విషయాన్ని వదలను..’ అంటూ విశాఖ నగర టీడీపీ మేయర్‌ పీలా శ్రీనివాసరావు జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్‌ హరేందిరప్రసాద్‌తో రెచ్చిపోయి మాట్లాడారు. విశాఖ ఉత్సవ్‌ ప్రారంబోత్సవంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి మధ్య ప్రొటోకాల్‌ వివాదం తలెత్తినట్లు సమాచారం. విశాఖ ఉత్సవ్‌ ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్‌.. మేయర్‌ శ్రీనివాసరావును కాస్త పక్కన కూర్చోగలరు.. అని అన్నట్లు తెలిసింది. అంతే.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్‌ శివాలెత్తిపోయారు.

హోంమంత్రి అనిత సమక్షంలోనే వాదులాటకు దిగారు. అక్కడ నుంచి విసురుగా లేచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. కలెక్టర్‌ జోక్యం చేసుకుని.. తాను వేరే ఉద్దేశంతో అనలేదని, వచ్చి కూర్చోవాలని సర్ది చెప్పేందుకు యత్నించినా ఆయన శాంతించలేదు. తమాషాగా ఉందా అంటూ కలెక్టర్‌పై రెచ్చిపోయారు. మంత్రులు దుర్గేష్, వీరాంజనేయస్వామి, అనిత కలెక్టర్‌ని వారించసాగారే తప్ప మేయర్‌ని నిలువరించే ప్రయత్నం చేయలేదు. దీంతో పీలా శ్రీనివాసరావు మరింత రెచ్చిపోయి హడావుడి చేశారు. కూర్చోండి.. రండి.. అంటూ కలెక్టర్‌ మేయర్‌పై చేతులు వేసి బతిమిలాడారు.

మేయర్‌ ఒక్కసారిగా కలెక్టర్‌ చేతుల్ని బలంగా నెట్టేసి.. వేలు చూపిస్తూ వార్నింగ్‌ ఇచ్చారు. వెళ్లిపోతానులెండి.. ఏం మాట్లాడుతున్నావయ్యా.. అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయారు. ఈ పరిణామంతో కలెక్టర్‌ నిశ్చేష్టుడయ్యారు. ముగ్గురు మంత్రులున్నా కనీసం ఈ వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించకపోవడంతో మనస్తాపానికి గురైన కలెక్టర్‌ అక్కడి నుంచి వెళ్లి కొద్దిసేపు కారులో కూర్చున్నారు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్‌తోనే మేయర్‌ ఈ విధంగా వ్యవహరించటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి