Breaking News

బ్యాంకు డిపాజిట్లపై గరిష్ట వడ్డీ

Published on Fri, 10/11/2024 - 04:20

బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం ద్వారా వడ్డీ పొందాలనుకునే వారికి ఇదే మంచి తరుణం. ప్రస్తుతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అయితే భవిష్యత్తులో వీటిని తగ్గించే అవకాశముందంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టమైన సంకేతాలను అందించింది. డిసెంబర్‌కు పావు శాతం, వచ్చే మార్చి నాటికి మరో పావు శాతం కలిపి.. ఆరు నెలల్లో వడ్డీ రేట్లు అర శాతం వరకూ తగ్గుతా­యని అంచనా. 

ఇప్పటికే అమెరికా వడ్డీ రేట్లు తగ్గించడంతో మన దేశంలో­నూ  వడ్డీ రేట్లు తగ్గుతా­యనుకుంటుండగా..  ద్రవ్యోల్బణం సాకుతో ఆర్‌బీఐ తగ్గింపును వాయిదా వేసింది. దీంతో బ్యాంకు­లు కూడా అధిక వడ్డీ రేటును అందిస్తున్న పరిమిత కాల డిపాజిట్ల పథకాలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణ ప్రజలకు 7.10 శాతం నుంచి 7.40 శాతం వరకు వడ్డీని అందిస్తుండ­గా, ప్రైవేటు రంగ బ్యాంకులు 7.25 నుంచి 8.10 శాతం వరకు అందిస్తున్నాయి.  – సాక్షి, అమరావతి

కనిష్ట స్థాయికి డిపాజిట్లు.. మేల్కొన్న బ్యాంకులు
దేశీయ అతి పెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అమృత కలశ, అమృత వృష్టి పేరుతో ప్రవేశపెట్టిన రెండు ప్రత్యేక డిపాజిట్ల పథకాలను 31 మార్చి, 2025 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 444 రోజుల కాల పరిమితి ఉన్న అమృత వృష్టి పథకంపై 7.25 శాతం, 400 రోజుల అమృత కలశ పథకంపై 7.10 శాతం వడ్డీ రేటును ఎస్‌బీఐ అందిస్తోంది. 

అతి పెద్ద ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ నాలుగేళ్ల ఏడు నెలల కాలపరిమితికి 7.40 శాతం వడ్డీని అందిస్తోంది. చైతన్య గోదావరి వంటివి ఏడాది దాటి.. రెండేళ్ల లోపు కాల పరిమితికి 8.10 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కొంతకాలంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉండి బంగారం, స్టాక్‌ మార్కెట్లు మంచి రాబడి ఇస్తుండటంతో ప్రజలు బ్యాంకు డిపాజిట్ల వైపు అంతగా మొగ్గు చూపలేదు. దీంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్యాంకుల డిపాజిట్లు కనిష్ట స్థాయికి చేరాయి. 

దీంతో ఇప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచి డిపాజిట్లను పెంచుకోవడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ స్థాయి వడ్డీ రేట్లు ఎంతోకాలం కొనసాగే అవకాశం లేదని, దీర్ఘకాలిక డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇది మంచి తరుణమంటున్నారు. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)