Breaking News

శ్రీశైలం పదో నంబర్ గేట్ వద్ద భారీగా వాటర్‌ లీకేజీ

Published on Sun, 07/06/2025 - 07:58

సాక్షి, నంద్యాల: శ్రీశైలం జలాశయం పదో నంబర్ గేట్ వద్ద భారీగా వాటర్‌ లీకేజీ అవుతోంది. గత నెలలో ఈ గేటు వద్ద మరమ్మతులు నిర్వహించినప్పటికీ భారీగా నీరు లీకేజీ కావడం గమనార్హం. జలాశయం అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా లీకేజీ జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.

వివరాల ప్రకారం.. శ్రీశైలం జలాశయం పదో నంబర్ గేట్ వద్ద గత నెలలో అధికారులు రబ్బర్‌ సీల్స్‌ మార్చారు. వాటర్‌ లీకేజీ కారణంగా మరమ్మతులు నిర్వహించారు. దీని కోసం ప్రభుత్వం.. సుమారు కోటి ముప్పై లక్షలు నిధులను కేటాయించింది. కానీ, తాజాగా మరోసారి అక్కడే వాటర్‌ లీకేజీ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, నాసిరకంగా పనులు చేసినట్టు తెలుస్తోంది. లీకేజీ కావడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇక, జలాశయం అధికారుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద కొనసాగుతోంది. జూరాల నుండి 1,09,277 క్యూసెక్కులు నీటి ప్రవాహం శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతోంది. సుంకేసుల నుండి 61,931 క్యూసెక్కులు నీరు వస్తోంది. ప్రస్తుతానికి శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 1,71,208 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 67,399  క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు.. ప్రస్తుతం :179.8995 టీఎంసీలుగా ఉంది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జలాశయం గరిష్ట స్థాయికి చేరువలో ఉండటంతో గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

 

 

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)