Breaking News

భారీగా జిల్లా జడ్జీల బదిలీ

Published on Tue, 04/08/2025 - 06:19

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ స్థాయిలో జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 54 మందికి స్థాన చలనం కల్పించింది. వీరంతా ఈ నెల 21లోపు కొత్త పోస్టుల్లో చేరాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అత్యధి­కులను ప్రస్తుతం పని చేస్తున్నచోట మూడేళ్ల కాల పరిమితి పూర్తి కావడంతో నిబంధనల ప్రకారం, కొందరిని అభ్యర్థన మేరకు హైకోర్టు బదిలీ చేసింది. 

⇒ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పెషల్‌ జడ్జి బి.సత్యవెంకట హిమబిందును రాష్ట్ర లీగల్‌ సర్వీ­సెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శిగా నియమించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబితను విజయనగరం ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జి (పీడీజే)గా, అనంతపురం పీడీజే జి.శ్రీనివాస్‌ను నెల్లూరు ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జిగా, చిత్తూరు పీడీజే ఎరుగుల భీమారావును అనంతపురం పీడీజేగా పంపారు.

⇒ విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌.శ్రీదేవిని ఏలూరు పీడీజేగా నియమించారు. ఆమె స్థానంలో గుంటూరు, పోక్సో కేసుల ప్రత్యేక జడ్జిగా ఉన్న ఎ.అనిత నియమితులయ్యారు.

⇒ కృష్ణా జిల్లా మచిలీపట్నం పీడీజేగా ఉన్న అరుణ సారికను చిత్తూరు పీడీజేగా బదిలీ చేశారు. మచి­లీపట్నం మొదటి అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జిగా ఉన్న చిన్నంశెట్టి రాజు విశాఖపట్నం పీడీజేగా నియమితులయ్యారు. ఆ స్థానంలో పనిచేసిన ఆలపాటి గిరిధర్‌ విశాఖపట్నం వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా బదిలీ అయ్యారు.

⇒ వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా ఉన్న జి.గోపి కృష్ణా జిల్లా మచిలీపట్నం పీడీజేగా బదిలీ అయ్యారు. కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి  జి.భూపాల్‌రెడ్డిని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పెషల్‌ జడ్జిగా నియమించారు.

⇒ నెల్లూరు పీడీజే డాక్టర్‌ సి.యామిని కడప పీడీజేగా, అక్కడ ఉన్న గొల్లా శ్రీదేవి అనంతపురం ఇండస్ట్రియల్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ కమ్‌ లేబర్‌ కోర్టు ప్రిసైడింగ్‌ అధికారిగా నియమితులయ్యా­రు. విజయనగరం పీడీజే బి.సాయికళ్యాణ్‌ చక్రవర్తిని గుంటూరు పీడీజేగా బదిలీ చేశారు. ఖాళీగా ఉన్న కర్నూలు సీబీఐ ప్రత్యేక కోర్టు స్పెషల్‌ జడ్జిగా ఎం.శోభారాణి నియమితులయ్యారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)