Breaking News

కావలి ఎమ్మెల్యే క్రూర ‘కావ్య’o

Published on Wed, 08/20/2025 - 05:48

సాక్షి టాస్క్ ఫోర్స్‌ :  కావలి టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి తన క్వారీల్లో క్రూర ‘కావ్య’ం ప్రదర్శించారు. ఆయన అక్రమ మైనింగ్‌ దందాను బయటపెట్టేందుకు ప్రయత్నించిన టీవీ జర్నలిస్టు, సో­షల్‌ మీడియా యాక్టివిస్టులపై దారుణంగా దాడి చే యించారు. బిహార్‌లోని పరిస్థితులను తలపించే లా హింసాత్మకంగా ప్రవర్తించారు. వారి చేతుల్లో కత్తు­లు పెట్టి... వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పంపడంతో ఎమ్మెల్యే కృష్ణారె­డ్డిని చంపడానికి వచ్చామని చెప్పిస్తూ వీడియో తీసి, అక్రమ కేసులు పెట్టి పోలీసులకు అప్పగించారు.  

మనీ స్కాం.. అక్రమ మైనింగ్‌ 
జలదంకి మండలం అన్నవరంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురురాఘవేంద్ర స్టోన్‌ క్రషర్‌ పేరుతో అక్రమ మైనింగ్‌ చేపడుతున్నారు. ప్రభుత్వానికి రూ.కోట్లలో రాయల్టీ, కరెంట్‌ చార్జీలు ఎగవేశారు. అనధికారికంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో మెటల్‌ తవ్వుతూ రూ.వందల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారు. మొత్తమ్మీద రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమంగా సంపాదించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఈ ఏడాది కావలిలో రూ.వందల కోట్ల మనీ స్కామ్‌ జరిగింది. పెద్దల పాత్ర ఉండడంతో ఎమ్మెల్యే, పోలీసులు దీన్ని పక్కదోవ పట్టించారు. 

ఇందుకుగాను ఎమ్మెల్యేకు రూ.250 కోట్ల ముడుపులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇటీవల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కక్షపూరిత రాజకీయాలతో వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బందిపెట్టసాగారు. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అసభ్యంగా దూషిస్తూ అంతు చూస్తానని బహిరంగంగానే బెదిరించారు. అయినా, వెనక్కుతగ్గని ప్రతాప్‌కుమార్‌రెడ్డి... ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అరాచకాలు, దోపిడీలు, దాషీ్టకాలు, అక్రమాలను తరచూ మీడియాకు వెల్లడిస్తున్నారు. 

మనీ స్కామ్‌ బాధితులకు  అండగా తన కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేయడంతో ఒక్కొక్కరుగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పరిణామాలతో కావ్య కృష్ణారెడ్డి పన్నాగం పన్నారు. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేశారు. 

సోషల్‌ మీడియా యాక్టివిస్టులు వెళ్తే... 
అన్నవరంలోని ఎమ్మెల్యే క్వారీల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను కావలి సోషల్‌ మీడియా యాక్టివిస్టు వేణు, అన్నవరం వాసి శ్రావణ్‌కుమార్, అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన వినోద్‌ వీడియో తీస్తుండగా క్వారీ క్రషర్‌ సిబ్బంది గుర్తించి ఎమ్మెల్యేకు చెప్పారు. శ్రావణ్‌కుమార్‌ పారిపోగా  మిగిలిన ఇద్దరిని చెట్టుకు కట్టేసి ఇష్టమొచ్చినట్లు కొట్టినట్లు తెలుస్తోంది. ఉదయం 12.30 నుంచి 3 గంటలపాటు తీవ్రంగా హింసించారు. చంపేస్తామంటూ భయపెట్టారు. 

అనంతరం తమ క్రషర్‌ వద్దకు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి రౌడీలను పంపించారంటూ జలదంకి ఎస్‌ఐ లతీఫున్నీసాకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వచ్చి.. ఇద్దరిని స్టేషన్‌కు తరలించారు. నిమిషాల్లోనే పోలీసులు వారిని కారులో కలిగిరి సీఐ కార్యాలయానికి, అక్కడినుంచి వివిధ స్టేషన్లకు తిప్పినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై ఎస్‌ఐ లతీఫున్నీసాను వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా అందుబాటులోకి రాలేదు. 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)