Breaking News

భారీగా సైబర్ నేరాలు

Published on Sun, 08/04/2024 - 06:05

సాక్షి, అమరావతి: దేశంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఐదేళ్లలో సైబర్‌ నేరస్తులు ఏకంగా 44,599 మోసాలు చేసి.. రూ.2,137 కోట్లు కొట్టేశారు. అత్యధికంగా 2023–24వ ఆర్థిక సంవత్సరంలోనే 29,082 మోసాలతో రూ.1,457 కోట్లను కొల్లగొట్టారని ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. 2019–20వ ఆర్థిక సంవత్సరం నుంచి 2023–24వ ఆర్థిక సంవత్సరం వరకు రూ.2,137 కోట్లు దోచేస్తే.. రూ.184 కోట్లే రికవరీ చేసినట్లు మంత్రి తెలిపారు. క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ తదితరాల ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. దేశంలో అత్యధికంగా హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ మోసాలు జరుగుతున్నాయని వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో అత్యల్పంగా గత ఐదేళ్లలో 575 సైబర్‌ మోసాలతో రూ.23.46 కోట్లను దోచేశారని తెలిపారు. ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం ద్వారా డిజిటల్‌ టెక్నాలజీల సురక్షిత వినియోగాని­కి వివిధ చర్యలు చేపట్టామన్నారు. ఆర్థిక నేరాలతో పాటు సైబర్‌ చీటింగ్‌లపై ఫిర్యాదుల కోసం కేంద్ర హోం శాఖ నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్, నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930ను ప్రారంభించిందన్నారు. బాధితులు అధికారిక కస్టమర్‌ కేర్‌ వెబ్‌సైట్‌ లేదా బ్యాంకు శాఖల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. 

సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. సోషల్‌ మీడియా ద్వారా కూడా అవగాహన కల్పిస్తోందని తెలిపారు. ఆర్‌బీఐతో పాటు బ్యాంకులు సైబర్‌ నేరాలపై ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. తద్వారా నష్టాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)