Breaking News

బాక్స్ క్రికెట్ కు భలే క్రేజ్

Published on Fri, 01/31/2025 - 05:00

సాక్షి, అమరావతి: మన దేశంలో క్రికెట్‌కు ఉండే క్రేజ్‌ అంతాఇంతా కాదు. కాస్త తీరిక.. కొద్దిగా ఖాళీ ప్రదేశం దొరికితే చాలు.. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్రికెటర్లు అయిపోతుంటారు. బ్యాట్, బాల్‌తో తమ ప్రతాపం చూపిస్తుంటారు. కానీ మారుతున్న పరిస్థితుల్లో నగరాల్లో ఖాళీ స్థలాలు కనుమరుగైపోయి క్రికెట్‌ ఆడుకోవడానికి కొద్దిపాటి స్థలం కూడా లేకుండా పోతోంది. ఈ సమస్యకు పరిష్కారంలా ‘బాక్స్‌ క్రికెట్‌’ (box cricket) పుట్టుకొచ్చింది. వయసుతో పాటు ఆడ, మగ అనే సంబంధం లేకుండా క్రికెట్‌పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు కాస్త సమయం దొరికితే.. వెంటనే ‘బాక్స్‌ క్రికెట్‌’లో వాలిపోతున్నారు. ఆదరణ పెరుగుతుండటంతో రాష్ట్రంలో బాక్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లు పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి.

బిజినెస్‌ రూపంలో కూడా ‘బాక్స్‌ క్రికెట్‌’ విజయవంతంగా కొనసాగుతోందని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. 300 గజాలకు పైగా స్థలం ఉంటే చాలు.. ఇళ్ల మధ్యలో అయినా బాక్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ను ఏర్పాటు చేయొచ్చు. సొంత స్థలం ఉంటే మరీ మంచిది. ఆ స్థలం ఇనుప కడ్డీలు పాతి బాక్స్‌ మాదిరిగా ఫ్రేమ్‌ సెట్‌ చేయాలి. బాల్‌ బయటకు పోకుండా చుట్టూ గ్రీన్‌ నెట్‌ ఏర్పాటు చేయాలి. కిందపడినప్పుడు దెబ్బలు తగలకుండా.. నేలపై గ్రాస్‌ కార్పెట్‌ పరచాలి. రాత్రి సమయంలో కూడా క్రికెట్‌ ఆడుకునే విధంగా ఫ్లడ్‌లైట్ల సదుపాయం కల్పించాలి. రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు.

 గల్లీ క్రికెట్‌ మాదిరే..
బాక్స్‌ క్రికెట్‌లో బ్యాట్‌ను స్వేచ్ఛగా ఝుళిపించవచ్చు.. బాల్‌ను గింగిరాలు తిప్పవచ్చు. అలాగే చుట్టూ నెట్‌ ఉండటం వల్ల బాల్‌ కోసం ఎక్కువ దూరం పరిగెత్తాల్సిన అవసరం కూడా ఉండదు. బాక్స్‌ క్రికెట్‌ రూల్స్‌ అన్నీ.. గల్లీ క్రికెట్‌ మాదిరిగానే ఉంటాయి. బాల్‌ నేరుగా నెట్‌కు తగిలితే సిక్స్‌.. స్టెప్‌లు పడుతూ వెళ్లి నెట్‌కు తగిలితే ఫోర్‌.. సింగిల్స్, డబుల్స్, రనౌట్లు.. అన్నీ సేమ్‌ టూ సేమ్‌. ఊరికి కాస్త దూరంగా ఉంటే తక్కువ చార్జీ, నగరం మధ్యలో ఉంటే కాస్త ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు. గంట సమయం ఆడుకోవాలంటే సుమారు రూ.600 నుంచి రూ.1,000 వరకు నిర్వాహకులు వసూలు చేస్తున్నారు.

బ్యాట్, బాల్, వికెట్లు నిర్వాహకులే అందజేస్తారు. ఎండ దెబ్బ కూడా తగలకుండా పైన గ్రీన్‌ మ్యాట్‌ను  వేస్తున్నారు. మంచినీరు, కూల్‌డ్రింక్స్, కేఫ్‌ వంటి వసతులు అందుబాటులో ఉంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10, 11 గంటల వరకు ఆడుకునే అవకాశం ఉండటంతో అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు తమ తీరిక సమయాల్లో బాక్స్‌ క్రికెట్‌ ఆడుతూ సేదతీరుతున్నారు. అలాగే ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ అవ్వాలనుకునేవారికి శిక్షణ ఇచ్చేందుకు కూడా కొన్ని బాక్స్‌ క్రికెట్‌ క్లబ్‌ల వద్ద కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

ఎవరైనా ఆడుకోవచ్చు
బాక్స్‌ క్రికెట్‌కు ఏ వయసు వారైనా రావచ్చు. పెద్ద వారు చాలా మంది వస్తున్నారు. సరదాగా ఆడుకుని వెళుతుంటారు. అలాగే ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా ఎదగాలనుకునే 20 ఏళ్లలోపు వారికి శిక్షణ కూడా ఇస్తుంటాం. ముంబై నుంచి వచ్చిన కోచ్‌తో పాటు మొత్తం ముగ్గురు కోచ్‌లు ఉన్నారు. ఆడపిల్లలు కూడా క్రికెట్‌ ఆడటానికి వస్తున్నారు. 
– గుత్తుల ఫణీంద్రబాబు, మేనేజర్, భారత్‌ బెస్ట్‌ స్పోర్ట్స్‌ క్లబ్, విజయవాడ

సెల్‌ఫోన్‌కు దూరం..
మా ఇద్దరు పిల్లల్ని రోజూ రెండు గంటల పాటు బాక్స్‌ క్రికెట్‌ ఆడుకోవడానికి పంపిస్తున్నాను. మా పెద్దబాబు బరువు కూడా తగ్గి ఆరోగ్యంగా ఉన్నాడు. అలాగే సెల్‌ఫోన్‌ అలవాటుకు కూడా దూరమవుతున్నారు.  – అరవింద్, ఆటోనగర్‌

ఇష్టంతో వస్తున్నా..
నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కొన్ని నెలలుగా బాక్స్‌ క్రికెట్‌ ఆడుతున్నాను. – తులసీ మాధవ్, మాచవరం

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు