Breaking News

నిబంధనలు కాల‘రాశారు’

Published on Sat, 12/27/2025 - 02:58

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది. శతాబ్ది వేడుకల వేళ ఏయూ ఘనకీర్తి అభాసుపాలవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన దూరవిద్య కేంద్రంలో ప్రస్తుతం పారదర్శకత కొరవడింది. పరీక్షపత్రాల ముద్రణ, పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనంలో అధికారులు నిబంధనలను కాలరాస్తున్నారు. ఫలితంగా అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. 

ఏడాదికి రెండు సార్లు దూరవిద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, వాటిని సవ్యంగా నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఐఐటీ నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని వైస్‌ చాన్సలర్‌గా నియమించామని గొప్పలు పోయిన చంద్రబాబు సర్కారు విద్యా ప్రమాణాలను దారుణంగా దిగజారుస్తోంది.  

పరీక్షలు ఎందుకు రద్దు చేయలేదు? 
ఏయూ దూరవిద్యలో భాగంగా ఈ ఏడాది మార్చి–ఏప్రిల్‌లో ఒకసారి పరీక్షలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 కేంద్రాల్లో పరీక్షలు పెట్టగా కొత్తవలసలోని వాగ్దేవి కళాశాలలో భారీ స్థాయిలో మాస్‌ కాపీయింగ్‌ జరిగింది. దీంతో ఆ కళాశాల సెంటర్‌ను మూసివేసి పక్కన ఉన్న ప్రగతి కళాశాలకు పరీక్ష కేంద్రాన్ని మార్చారు. అయితే, వాగ్దేవి సెంటర్‌లో జరిగిన పరీక్షలను రద్దు చేయకుండా ఇప్పుడు తాపీగా మూల్యాంకనం జరిపి ఫలితాలు ఇచ్చేందుకు సిద్ధపడడం అనుమానాలకు తావిస్తోంది. 

ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు, ఇతర ప్రలోభాలకు ఏయూ అధికారులు లొంగిపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి జవాబు పత్రాల మూల్యాంకనం చేసేవారికి ఆ పేపర్‌ ఏ సెంటర్‌ నుంచి వచి్చంది? ఎవరు రాశారు అనే వివరాలు లేకుండా కోడింగ్, డీకోడింగ్‌ పద్ధతిలో చేపడతారు. అలాంటిది నిబంధనలకు విరుద్ధంగా మాస్‌ కాపీయింగ్‌ చేసిన సెంటర్‌లోని పరీక్ష పత్రాలను ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం చేయిస్తుండటంతో అవి ఏ సెంటర్‌లోనివో, అక్కడి రాసిన విద్యార్థులు ఎవరో సమాచారం బహిరంగ రహస్యంగా మారిపోయిందనే వాదన వినిపిస్తోంది. 

ఇలాంటప్పుడు ఆ ఫలితాల పారదర్శకతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వాస్తవానికి జవాబు పత్రాల మూల్యాంకనం దూరవిద్యలోని ప్యానల్‌ నామినేట్‌ చేసిన వ్యక్తులు మాత్రమే చేయాలి. ఈ లిస్టును వీసీ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇక్కడ సైకాలజీ పేపర్లను ప్రైవేటు కళాశాలలకు చెందిన లెక్చర్లతో గుట్టుచప్పుడు కాకుండా మూల్యాంకనం చేయిస్తుండటం గమనార్హం. ఇక్కడే, కనీస నియమాలను పాటించకుండా దూరవిద్య డైరెక్టర్‌ ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంతో వర్సిటీ ఖ్యాతి దిగజారిపోతోంది.  

మార్చిన పరీక్ష కేంద్రంలోనూ కాపీయింగ్‌! 
ఇదిలా ఉంటే వాగ్దేవి పరీక్ష కేంద్రం నుంచి ప్రగతి కళాశాలకు పరీక్ష కేంద్రాన్ని మార్చినా మాస్‌ కాపీయింగ్‌ ఆగట్లేదు. నవంబర్‌ నుంచి జరుగుతున్న దూరవిద్య పరీక్షల్లోనూ మరోసారి మాస్‌ కాపీయింగ్‌ కలకలం సృష్టించింది.  ఏయూ దూరవిద్య కేంద్రంలో సుమారు 1400 మందికిపైగా పరీక్ష రాసే వసతి అందుబాటులో ఉంది. ఒకప్పుడు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్‌సీ వంటి దూరవిద్య పరీక్షలు ఏయూ కేంద్రంలోనే పారదర్శకంగా జరిగేవి. అలాంటి కేంద్రాన్ని పట్టించుకోని అధికారులు ప్రైవేటు కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)