Breaking News

వివాహిత అనుమానాస్పద మృతి..!

Published on Mon, 08/25/2025 - 09:12

భద్రాద్రి జిల్లా: ఓ వివాహిత అనుమానా స్పదంగా మృతి చెందిన ఘటనపై ఆదివారం ఆమె భర్తతో పాటు మరో ముగ్గురిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్థానిక ఎస్సైటి.యయా తీ రాజు కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చవరం గ్రామ పంచాయతీ విశ్వనా థపురం గ్రామానికి చెందిన పూల లక్ష్మీప్రసన్న(33)కు, మండలంలోని ఖాన్‌ఖాన్‌పేటకు చెందిన పూల నరేష్‌బాబుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. కాగా, గత కొన్నేళ్లుగా వీరిమధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకుంటున్నాయి. 

ఈ గొడవల నేపథ్యంలోనే మూడేళ్ల క్రితం నరేష్‌బాబు తన సొంత అక్క దాసరి విజయలక్ష్మి స్వగ్రామమైన అశ్వారావుపేట పట్టణంలోని కోనేరుబజార్‌లో ఉన్న ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజామున లక్ష్మీప్రసన్న ఇంట్లో పనిచేస్తుండగా జారిపడి తల, నుదిటి భాగాల్లో గాయపడినట్లు ఆమె కుటుంబీకులకు భర్త సమాచారం ఇచ్చి స్థానిక ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు ఏపీలోని రాజమండ్రికి రిఫర్‌ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

మృతిపై అనుమానాలు.?
లక్ష్మీ ప్రసన్న కిందపడి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు భర్త నరేష్‌బాబు, అతడి బంధువులు ఇచ్చిన సమాచారంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు రాజమండ్రిలోని ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో వెంటిటేటర్‌పై విగతజీవిగా పడిఉన్న లక్ష్మీప్రసన్న శరీరంపై ఉన్న గాయాలతో పాటు శారీరకంగా కుశించుకుపోయి కనిపించడంతో మృతిపై అనుమానాలు వచ్చాయి. దీంతో తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నట్లు తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె భర్తతో పాటు పూల విజయలక్ష్మి, దాసరి భూలక్ష్మి, దాసరి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)