Breaking News

వీడియో: కాసేపట్లో పెళ్లి.. సినిమా రేంజ్‌లో పెళ్లి కూతురు జంప్‌

Published on Sat, 10/26/2024 - 11:47

సాక్షి, కర్నూలు: కాసేపట్లో జరగబోయే వివాహ తంతుకు సినిమా రేంజ్‌ సీన్‌ తోడైంది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా.. పెళ్లి కూతురు  ప్రియుడితో కలిసి జంప్ అయింది. ఈ ఘటన క‌ర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన అబ్బాయితో.. అనంతపురానికి చెందిన వైష్ణవికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పత్తికొండలోని గోపాల్ ప్లాజా కళ్యాణ మండపంలో పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేశారు. వధువు, వరుడు.. వారి కుటుంబ సభ్యులు మండపానికి చేరుకున్నారు.. తెల్లవారితే పెళ్లి కాగా.. ఇంతలోనే ఊహించని పరిస్థితి ఎదురైంది.

పెళ్లి ఇష్టం లేని పెళ్లికూతురు తన ప్రియుడికి ఫోన్‌ చేయడంతో అతను స్నేహితుడితో కలిసి మండపానికి వచ్చారు. ఈ క్రమంలో క‌ల్యాణ‌ మండ‌పం నుంచి తెల్లవారుజామున‌ ప్రియుడితో కలిసి బైక్‌పై పారిపోయారు. ఈ ఘటనతో పెళ్లి ఆగిపోయింది. కూతురు పెళ్లి నిలిచిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే కల్యాణ మండపం నుంచి పెళ్లి కూతురు వెళ్లి పోతున్న దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)