Breaking News

షూరిటీల పేరుతో ‘మార్గదర్శి’ వేధింపులు

Published on Sun, 03/17/2024 - 08:00

నరసరావుపేట రూరల్‌: షూరిటీల పేరుతో ఖాతాదారులను మార్గదర్శి చిట్స్‌ యాజ­మాన్యం వేధిస్తోందని మార్గదర్శి చిట్స్‌ బాధి­తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్‌ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిట్‌ పాడు­కున్న ఖాతాదారులకు సకాలంలో నగదు చెల్లించడం లేదన్నారు. షూరిటీలు సరిపోవనే నెపంతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. దీంతో పాటు ఆ నగదులో కొంత ఫిక్స్‌డ్‌ డిపా­జిట్‌ చేయాలని ఖాతా­దారులపై ఒత్తిడి తీసుకు­వస్తారని చెప్పారు.

చట్టవ్యతిరేకంగా మార్గ­దర్శిలో చిట్‌లు నిర్వ­హిస్తున్నారని  తెలి­పారు. చిట్‌ గ్రూప్‌లోని సభ్యులందరికీ ఎప్పటి­కప్పుడు సమాచారం అందించాల్సిన  బాధ్యత నిర్వాహకులపై ఉంద­న్నారు. నెలవారీ నగ­దును డిపాజిట్‌ చేసే బ్యాంక్‌ వివరాలు కూడా చిట్‌ సభ్యులకు తెలియ­జేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే దీనిపై న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మార్గదర్శి చిట్‌ వ్యవహరిస్తోందని తెలిపారు. సకాలంలో చిట్‌ నగదు చెల్లించలేదనే నెపంతో జరిమానాలు, వడ్డీలు వేస్తున్నారని  తెలిపారు.

పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అధిక శాతం సభ్యులుగా మార్గదర్శి చిట్స్‌లో ఉన్నారని తెలిపారు. వీరి నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 270 మంది ఖాతాదారులు మార్గదర్శి చిట్స్‌లో మోసపో­యామని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈవిధంగా పల్నాడు  జిల్లాలో 18 మంది ముందుకు వచ్చారని వివరించారు.

నరసరావుపేట డిప్యూటీ రిజిస్ట్రార్‌ చిట్స్, మార్గదర్శి బ్రాంచ్‌ మేనేజర్‌తో కుమ్మక్కై ఖాతాదారులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. చిట్‌ నగదు చెల్లించిన ఖాతాదారుల ఆస్తులను జప్తు చేసుకునే విధంగా మార్గదర్శి యాజమా­న్యానికి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. మార్గదర్శి చిట్స్‌లో మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

ఇదీ చదవండి: చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)