Breaking News

మావోయిస్టు అగ్ర‌నేత జ‌గ‌న్‌కు మాతృవియోగం

Published on Thu, 03/09/2023 - 12:27

సాక్షి, అల్లూరి: మావోయిస్టు అగ్రనేత కాకూరి పండన్న అలియాస్ జగన్, తల్లి సీతమ్మ కన్నుమూసింది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే.. ఆ మధ్య ఆమె దీనస్థితి గురించి తెలుసుకున్న అధికారులు.. ఆమె ఇంటికి వెళ్లి మరీ చికిత్సకు సాయం అందించారు. అయినప్పటికీ వృద్ధాప్యరిత్యా సమస్యలతో నెల తిరగకుండానే ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. 

పండన్న అలియాస్‌ జగన్‌ స్వ‌గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దుప్పిల‌వాడ పంచాయ‌తీ పరిధిలోని కొమ్ముల‌వాడ గ్రామం. పండన్న ఉద్య‌మంలోకి వెళ్లిన‌ నాటి నుంచి త‌ల్లి సీత‌మ్మ స్వగ్రామంలో ఉంటోంది. అయితే.. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న సీతమ్మకు.. కిందటి నెలలో పోలీసులు చికిత్స సాయం అందించారు. 

ఆ సమయంలో ఉద్యమాన్ని వదిలి జనాల్లోకి రావాలని, వచ్చి వ్యవసాయం చేసుకోవాలని, అన్నింటికి మించి వృద్ధాప్యంలో ఉన్న త‌న బాగోగులు చూసుకోవాల‌ని ఆమె తన కొడుకుకి పిలుపు ఇచ్చారు. ఇది జరిగిన నెలకే ఆమె కన్నుమూశారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రా-ఒడిశా ప్ర‌త్యేక జోన‌ల్ క‌మిటీ ప్ర‌త్యామ్నాయ స‌భ్యుడైన జగన్‌, తన తల్లి అంత్యక్రియలకు హాజరవుతాడనే ఉద్దేశంతో పోలీసులు నిఘా పెంచారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)