Breaking News

మన్యంలోకి మళ్లీ మావోలు!

Published on Sun, 01/12/2025 - 03:53

సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్ట్‌ల కదలికలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. 2022లో ఏవోబీ నుంచి మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులకు తరలివెళ్లిన మావోయిస్ట్‌ నేతలు ఏవోబీకి తిరిగొస్తున్నారు. ఏవోబీలో కార్యకలాపాలు విస్తరించాలన్న మావోయిస్ట్‌ పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు వారు తిరిగొస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసు శాఖను ఇప్పటికే అప్రమత్తం చేశాయి. 

2022లో ఏవోబీని విడిచిపెట్టి.. 
రెండేళ్లుగా ఏవోబీలో మావోయిస్ట్‌ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో పోలీసు శాఖ సమర్థ పనితీరుతోపాటు గిరిజన ప్రాంతాల్లో భారీ స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టింది. ఏవోబీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగును ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ ద్వారా నిర్మూలించింది. మావోయిస్ట్‌ కార్యకలాపాల్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేసింది. 

ఏవోబీలో 20 ఏళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించిన మావోయిస్ట్‌లు దాదాపు పూర్తిగా పట్టుకోల్పోయారు. ఒకప్పుడు 500 మంది నేతలు, 1,500 మంది మిలీషియా సభ్యులతో పోలీసులకు సవాల్‌ విసిరిన మావోయిస్ట్‌ పార్టీ బలం పూర్తిగా నీరుగారిపోయింది. కేవలం 20 మంది నేతలు, 100 మంది మిలీషియా సభ్యులకు పరిమితమైపోయింది. వారిలో కూడా క్రియాశీలంగా కేవలం 50 మంది మాత్రమే మిగిలారు. 

ఈ నేపథ్యంలో మావోయిస్ట్‌ పార్టీ అగ్రనాయకత్వం అప్రమత్తమై మిగిలి ఉన్న మావోయిస్ట్‌ నేతలు, క్రియాశీల నేతలను మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులకు తరలివెళ్లా­లని ఆదేశించింది. ఏవోబీలో మావోయిస్ట్‌ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌తోపాటు ఆ పార్టీ నేతలు మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని సురక్షిత స్థావరాలకు 2022 చివరిలో తరలివెళ్లిపోయారు. అప్పటినుంచి రెండేళ్లుగా ఏవోబీలో మావోయిస్ట్‌ పార్టీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.  

బ్యాక్‌ టు ఏవోబీ 
ఇటీవల కాలంలో మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్‌లలో ఆ రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర భద్రతా బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్లతో విరుచుకుపడుతున్నాయి. 2024లో దేశవ్యాప్తంగా 287 మంది మావోయిస్ట్‌లు ఎన్‌కౌంటర్లలో హత మవ్వగా.. వెయ్యి మందికిపైగా అరెస్టయ్యారు. వారిలో 190 మంది ఛత్తీస్‌గఢ్‌లోనే హతమవ్వడం గమ­నార్హం. 

ఈ నేపథ్యంలో మావోయిస్ట్‌ పార్టీ అగ్ర­నాయకత్వం కొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులు ఇక ఏమాత్రం సురక్షిత స్థానం కాదని చెబుతూ ఏవోబీకి చెందిన 20 మంది మావోయిస్ట్‌ నేతలతోపాటు మొత్తం 50 మంది మావోయిస్ట్‌లను వెన­క్కి వెళ్లాలని ఆదేశించింది. దాంతో మావోయిస్ట్‌ నేతలు దశలవారీగా ఏవోబీలోకి వస్తున్నట్టు  కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. 

రాష్ట్ర పోలీసు శాఖను ఈ విషయంపై అప్రమత్తం చేశాయి. ఇప్పటి­కే ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని దాదాపు 20 మండలాల్లో మావోయిస్ట్‌లు, మిలీషి­యా సభ్యుల కదలికలు మెల్లగా ఊపందుకున్నట్టు రాష్ట్ర పోలీసు శాఖ గుర్తించింది. మావోయిస్ట్‌ల కదలికలపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నాయి.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)