Breaking News

చందనా.. డబ్బులిస్తావా.. కోరిక తీరుస్తావా!

Published on Tue, 08/12/2025 - 12:31

ధర్మవరం అర్బన్‌: వివాహిత పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం టూ టౌన్‌ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. ధర్మవరంలోని శారదానగర్‌ నివాసముంటున్న సాకే చందన, గణేష్‌ దంపతులు ఏడాదిన్నర క్రితం బత్తలపల్లిలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. వ్యాపార లావాదేవీలన్నీ చందన చూసుకునేది. గణేష్‌ కియా కంపెనీలో పనిచేస్తూ రోజూ వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో బత్తలపల్లి తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న బోయ గోపాల్‌ తరచూ అంగడికి వస్తూ చందనతో మాటలు కలిపి ఆమె ఫోన్‌ నంబర్‌ సేకరించుకున్నాడు. అనంతరం పలుమార్లు చందనతో ఫోన్‌లో మాట్లాడాడు.

ఆ సమయంలో ఆమె మాటలను రికార్డు చేసి, వాటిని చందనకు వినిపించి, తనకు డబ్బు ఇవ్వాలని, లేకపోతే తన కోరిక తీర్చాలని బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. ఈ విషయాన్ని తన భర్తకు చందన చెప్పడంతో బత్తలపల్లి నుంచి ధర్మవరానికి మకాం మార్చారు. అయినా చందనను గోపాల్‌ ఇబ్బంది పెట్టడం మానలేదు. ఈ నెల 7న గణేష్‌ డ్యూటీకి వెళ్లిన సమయంలో 8వ తేదీ తెల్లవారుజామున చందన ఇంటికి గోపాల్‌ వెళ్లి తలుపులు గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె తలుపులు తీయగానే తనతో వస్తావా? రావా అంటూ బలవంతం చేస్తూ తన మాట వినకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆ సమయంలో చందన గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకుంటుండగా గోపాల్‌ పారిపోయాడు. ఘటనపై బాధితురాలు సోమవారం ఉదయం  టూ టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం బోయ గోపాల్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)