Breaking News

నలుగురు భార్యలు, ఆరుగురు సంతానం.. ఐదో పెళ్లికి రెడీ!

Published on Fri, 09/05/2025 - 11:53

తూర్పు గోదావరి జిల్లా: అతనికి నలుగురు భార్యలు, ఆరుగురు పిల్లలు. ప్రస్తుతం ఒక భార్య 9 నెలల గర్భిణి. అయినా ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ నిత్య పెళ్లికొడుకు. అతనిపై యానాం లోని గిరియాంపేటకు చెందిన రెండో భార్య శీలం సాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం గురువారం అతని మోసాల గురించి మీడియాకు వివరించింది. ‘యానాంలోని సావిత్రినగర్‌కు చెందిన ఎస్‌.రమేష్‌  నేను ప్రేమించుకున్నాం. మా ప్రేమ గురించి 2016లో యానాం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి చెప్పాం. పెద్దల సమక్షంలో యానాం వెంకన్న ఆలయంలో పెళ్లి చేసుకున్నాం. 

మాకు ఇద్దరు సంతానం కలిగారు. కానీ, అప్పటికే రమేష్‌కు భైరవపాలేనికి చెందిన కామేశ్వరితో మొదటి వివాహమైందని, ఆమెతో విభేదాలు రావడంతో వదిలేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నాతో కాపురం చేస్తూనే చొల్లంగిపేటకు చెందిన సత్యవేణిని మూడో వివాహం చేసుకున్నాడు. వీరవేణి అనే మహిళను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. నన్ను, నా పిల్లలను రోడ్డుపాలు చేశాడు. మూడో వివాహం చేసుకున్న మహిళను హైదరాబాదులో, నాలుగో పెళ్లి చేసుకున్న మహిళను కాకినాడలో పెట్టాడు. 

మొదటి వివాహం చేసుకున్న ఆమెకు ఒక పాప. రెండో వివాహం చేసుకున్న నాకు ఇద్దరు పిల్లలు. మూడో వివాహం చేసుకున్న ఆమెకు ముగ్గురు సంతానం. నాలుగో భార్య ప్రస్తుతం 9 నెలల గర్భిణి. అయినా రమేష్‌ మళ్లీ ఐదో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. న్యాయం కోసం నేను పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అని శీలం సాయి తెలిపారు. దీనిపై పోలీసులను వివరణ అడగగా.. ఇద్దరిని కలపడానికి ప్రయతి్నంచామని, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని చెప్పారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)