Breaking News

మైదుకూరులో షర్మిలకు షాక్‌.. జగనన్న సంక్షేమ పథకాల వివరణ

Published on Mon, 04/08/2024 - 19:49

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలకు అడుగడుగునా నిరసనలే వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని జనం నిలదీస్తున్నారు. తాజాగా వైఎస్సార్‌ కడప జిల్లామైదుకూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిలకు అక్కడి ప్రజలు షాక్‌ తగిలింది. దువ్వూరులో షర్మిల మాట్లాడుతుండగా జై జగన్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు.

మాట్లాడేందుకు ఒకరు వేదికపైకి రావాలంటూ షర్మిల ఆహ్వానించారు. ఈ మేరకు మైదుకూరు జేసీఎస్‌ కన్వీనర్‌ యేమిరెడ్డి చంద్రోబుల్‌ రెడ్డి వేదికపైకి వెళ్లారు. సీఎం జగన్‌ రాష్ట్రానికి ఏం చేశారో, మళ్లీ ఆయనకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలంటూ షర్మిల సవాల్‌ విసిరారు. షర్మిల సవాల్‌కు స్పందించిన చంద్రఓబుల్ రెడ్డి.. అదిరిపోయే జవాబు ఇచ్చారు.

షర్మిల ఎదుటే సీఎం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి పూసగుచ్చినట్లు వివరించారు. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ తమ సమస్యలు విని, నేను ఉన్నానని అండగా నిలిచారని తెలిపారు. ఇచ్చిన ప్రతి మాట సీఎం నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తామంతా సీఎం జగన్‌కు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దీంతో అక్కడున్న ప్రజలంతా మరోసారి జై జగన్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)