Breaking News

చికిత్స అందక వ్యక్తి మృతి

Published on Wed, 12/03/2025 - 04:47

పిఠాపురం:  24 గంటలూ పనిచేయాల్సిన పీహెచ్‌సీకి సిబ్బంది కొరతతో తాళాలు వేయడంతో అర్ధ­రాత్రి గుండెనొప్పితో అత్య­వసరస్థితిలో వచ్చిన ఓ వ్యక్తి సకాలంలో చికిత్స అందక మరణించిన హృదయవిదారక ఘ­టన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని గొల్ల­ప్రోలు మండలం చేబ్రోలులో జరిగింది. ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామానికి చెందిన ఇమంది మాణిక్యం (56) చేబ్రోలులోని ఒక హోటల్‌లో పనిచేస్తున్నాడు.  

అతడు సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండెనొప్పిగా ఉందంటూ సహచరులకు చెప్పాడు. హోటల్‌ నిర్వాహకులు అతడిని చేబ్రోలు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడకు వెళ్లేసరికి పీహెచ్‌సీకి తాళా­లు వేసి ఉండడంతో 108కి కాల్‌ చేశారు. కానీ, 108 వాహనం కూడా గంట తరువాత వచ్చింది. అందులోని సిబ్బంది మాణి­క్యాన్ని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. సకాలంలో వైద్యం అంద­కే మాణి­క్యం మృతి చెందినట్లు అతడి బంధువు­లు ఆరోపిస్తున్నారు. పీహెచ్‌సీ తీసి ఉంటే, ప్రథమ చికిత్స అంది ఉండేదని, మాణిక్యం బతికేవాడన్నారు.   

డీఎంహెచ్‌వో విచారణ 
ఈ ఘటన నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖా­ధి­కారి జె.నరసింహ నాయక్‌ మంగళవారం చేబ్రోలు పీహెచ్‌సీలో విచారణ జరిపారు. సిబ్బందిని, స్థానికులను అడిగి మాణిక్యం మృతికి కారణాలు తెలుసుకున్నారు. ఆస్పత్రికి తా­ళాలు వేసి ఉండకూడదన్నారు. 

ఇక్కడ సిబ్బంది కొరతపై  ఆరు నెలలుగా డీఎంహెచ్‌వో­కు వినతులిచ్చామని, వాట్సాప్‌ సందేశాలు పంపించామని, అయినప్పటికీ ఎటువంటి చర్య­లూ తీసుకో­లేదని స్థా­నికు­లు ఆయనను నిలదీశారు. దీనిపై డీఎంహెచ్‌వో స్పందిస్తూ వైద్య సిబ్బంది సెలవుల పైన, డిప్యూటేషన్‌లో ఉండటం వల్ల ఇబ్బంది కలిగి ఉండవచ్చని, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు విచారణ నివేదిక అందజేస్తామని తెలిపారు. 

వైద్యుడి సస్పెన్షన్‌ 
డ్యూటీ రోస్టర్‌ వేయడం, అత్యవసర విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను చేబ్రోలు పీహెచ్‌సీ వైద్యుడు సాయిరతన్‌ను జిల్లా కలెక్టర్‌ ఆదే­­శాల మేరకు సస్పెండ్‌ చేసినట్లు డీఎంహెచ్‌ఓ నరసింహ నాయక్‌ తెలిపారు. చేబ్రోలు పీహెచ్‌సీలో ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు ఉన్నారని, వీరిలో ఒకరైన డాక్టర్‌ వి.నిఖిల్‌ సెలవులో ఉన్నారని, రెండో మెడికల్‌ ఆఫీసర్‌ సాయిరతన్‌ను సస్పెండ్‌ చేశామని, స్టాఫ్‌ నర్సుకు షోకాజు నోటీసు ఇచ్చామని వివరించారు. 

తాళ్లరేవు వైద్యాధికారి ఎల్‌.సురేష్ కుమార్‌ను డిప్యూటేషన్‌పై చేబ్రోలు పీహెచ్‌సీకి పంపించామన్నారు. డిప్యూటేషన్‌పై ఉన్న స్టాఫ్‌ నర్స్‌ను చేబ్రోలు పీహెచ్‌సీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. ఇదిలా ఉంటే చంద్రబాబు పాలనలో పీహెచ్‌సీల్లో సిబ్బందినీ నియమించలేని దుస్థితి నెలకొందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#

Tags : 1

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)