Breaking News

రూ.2000 నోట్లు మార్పిడి.. 90 లక్షలు నష్టం.. ఎలాగంటే!

Published on Tue, 06/27/2023 - 09:26

పార్వతీపురం: ‘రెండు వేల రూపాయల నోట్లు రూ.కోటి ఇస్తాం. మీరు రూ.500 నోట్లు రూ.90లక్షలు ఇవ్వండి చాలు..’ అని నమ్మబలికిన ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. రూ.పది లక్షలు లాభం ఆశ చూపించి రూ.90­లక్షలతో ఉడాయించారు. ఈ ఘటన పార్వతీపురంలో సోమవారం జరిగింది. పార్వతీపురం రూరల్‌ ఎస్‌ఐ వై.సింహాచలం తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురానికి చెందిన ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్‌.అనిల్‌కుమార్‌ ఓ ప్రైవేట్‌ బ్యాంకులో రుణాలు ఇప్పిస్తుంటారు.

వారి వద్దకు స్థానిక వడ్డీ వ్యాపారుల ద్వారా వారం రోజుల కిందట ఎన్‌.చక్రపాణి(కాకినాడ), ఎస్‌కే నజీమ్‌(భీమవరం) వచ్చి కలిశారు. తమకు తెలిసినవారి వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇస్తే... రూ.2వేల నోట్లు రూ.కోటి ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరిని పార్వతీపురం పిలిపించి ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్‌.అనిల్‌కుమార్‌లతో మాట్లాడించారు. ఒకే రోజు రూ.10 లక్షలు వస్తుందని ఆశతో ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్‌.అనిల్‌కుమార్‌ వారితో ఒప్పందానికి అంగీకరించారు.

తమ వద్ద ఉన్న నగదుతోపాటు స్నేహితులు, బంధువుల వద్ద కొంత తీసుకువచ్చి రూ.90 లక్షలను సోమవారం ఆ వ్యక్తులకు ఇచ్చారు. కొద్దిసేపు ఇక్కడే ఉంటే రూ.కోటి తెస్తామని చెప్పి వెళ్లిన ఇద్దరు తిరిగి రాలేదు. దీంతో తాము మోసపోయినట్టు గుర్తించిన ఆబోతుల అనిల్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యవర్తులుగా వ్యవహరించిన చక్రపాణి, నజీమ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిందితులను పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

చదవండి: ఏపీలో బంగారం తవ్వకాలు! ఎన్‌ఎండీసీ రూ. 500 కోట్ల వ్యయం..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)