Breaking News

పుష్టి.. నష్టి..

Published on Sat, 09/06/2025 - 05:45

సాక్షి, అమరావతి: పౌష్టికాహార లోపంతో బాల్యం బక్కచిక్కి­పోతోంది. ఎదుగుదల లోపం, బరువు తక్కువ, బక్కచిక్కిపో­వడం వంటి సమస్యలతో ఐదేళ్లలోపు చిన్నారులు సతమతమ­వు­తున్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇదే దైన్యం. రాష్ట్రంలో పౌష్టికాహార లోపంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా ఎదుగుదల లోపం, బరువు తక్కువ, బక్కచిక్కి­పోయిన పిల్లలు ఉన్నారు. అనంతరం కృష్ణా, గుంటూరు, ప్రకా­శం, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కు­వగా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల పోషకాహార లోపం సూచిక­లను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. 

అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్‌ ట్రాకర్‌ డేటా నుంచి ఈ వివరాలు సేకరించారు. జూన్‌లో దేశంలో 37.07 శాతం మంది ఐదేళ్లలోపు పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. 15.93 శాతం పిల్లలు బరువు తక్కువగా ఉన్నారు. 5.46 శాతం మంది పిల్లలు బక్కచిక్కిపోయి ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమా­లను అమలు చేస్తున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

పోషణ్‌ ట్రాకర్‌ ద్వారా పౌష్టికాహార­లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారి­కి పౌష్టి­కాహా­రం అందిస్తు­న్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో దేశం మొత్తంమ్మీద 7.36 కోట్ల మంది పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరారని, వీరిలో 7 కోట్ల మందిలో ఎత్తు, బరువు, పెరుగుదల, పౌష్టికాహార లోపాలను గుర్తించడంతో పాటు వాటి నివారణకు అవసరమైన చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)