Breaking News

పేద మహిళలకు మహిళాశక్తి ఆటోలు

Published on Thu, 12/07/2023 - 02:33

సాక్షి, అమరావతి: కిరాయి ప్రాతిపదికన ఆటోలు నడుపుకొంటున్న పొదుపు సంఘాల సభ్యులైన ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం గురువారం ‘మహిళాశక్తి’ పేరుతో ఆటోలను పంపిణీ చేయనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) పరిధిలో ‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున 660 మండలాల్లో 660 మందికి ఈ ఆటోలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలివిడతగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 231 మందికి వీటిని అందజేయనున్నారు.

జిల్లాల వారీగా ఎంపికైన లబ్ధిదారులకు ఆ జిల్లాల్లోనే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుందని సెర్ప్‌ అధికారులు వెల్లడించారు. గ్రా మీ­ణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ అహ్మద్‌ విజ యవాడకు సమీపంలోని గొల్లపూడిలోగల టీటీడీసీ కేంద్రంలో పదిమంది లబ్ధిదారులకు ఆటోలను పంపిణీ చేస్తారని తెలిపారు.

మహిళాసాధికారత లక్ష్యంగా నాలుగున్నరేళ్లుగా పొదుపు సంఘాల మ­హి­ళలకు వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ పథకాలను, 45–60 ఏళ్ల మధ్య వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత సహా అ­నే­క కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్ర­భుత్వం కొత్తగా స్వశక్తితో ఎదగాలని ఆశపడే పే­దింటి మహిళలకు చేయూతనిచ్చేందుకు ‘మహిళా­శక్తి’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుత ఆ­ర్థి­క సంవత్సరంలో పెట్టుకున్న లక్ష్యం మేరకు మి­గి­లిన లబ్ధిదారుల ఎంపికను ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి నాటికి పూర్తిచేసి వారికి ఆటోలు అందజేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. 

లబ్ధిదారులు భరించాల్సింది 10 శాతమే
ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో కేవలం పదిశాతం మేర లబ్ధిదారులు భరిస్తే మిగిలిన 90 శాతం మొత్తాన్ని ప్రభుత్వం సెర్ప్‌ ద్వారా అందిస్తోంది. ఆ 90 శాతం రుణాన్ని కేవలం అసలు మొత్తం 48 నెలవారీ కిస్తీల రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పించింది. సాధారణంగా పేదలు ఆటో కొనుగోలు చేయాలంటే బ్యాంకులు, ఇతర ఆర్థికసంస్థల నుంచి రుణం తీసుకుని, నెలవారీగా కిస్తీలు చెల్లి స్తుంటారు.

ప్రభుత్వం ఇప్పడు ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆటోల కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో 90 శాతం మొత్తాన్ని వడ్డీలేని రుణంగా ఇవ్వడంతో పాటు రుణం మొత్తాన్ని నెలవారీ కిస్తీల రూపంలో చెల్లించేందుకు వీలు కల్పించడంతో వడ్డీ రూపంలో దాదాపు రూ.లక్షన్నర మేర లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం కూడా కలుగుతుందని అధికారులు వివరించారు. ఆటోలను లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి అందజేస్తున్నట్టు చెప్పారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)