Breaking News

22న బంగాళాఖాతంలో అల్పపీడనం

Published on Sun, 05/19/2024 - 05:57

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఉత్తర ఈశాన్యం దిశగా ప్రయాణించి, తర్వాత మధ్య బంగాళాఖాతంలో 24 నాటికల్లా వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 25, 26 తేదీల మధ్య ఇది తుఫాను లేదా తీవ్ర తుఫానుగా మారి విశాఖపట్నం – తూర్పు గోదావరి జిల్లాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీని ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని, అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 

ఇప్పటికే ఛత్తీస్‌ఘడ్‌ నుంచి కొమరిన్, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో రాయలసీమలో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మూడు రోజుల పాటు ఉత్తరాం«ధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. 

వైఎస్సార్‌ కడప, పశ్చిమ ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.


పలుచోట్ల వర్షాలు
శనివారం కృష్ణా, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజలో 67.75 మిల్లీవీుటర్ల వర్షం పడింది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 40 మిల్లీవీుటర్లు, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మదీనాపాడులో 37, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిలకలూరులో 27.5, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిన్నాపురం, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 27 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.

ఉవ్వెత్తున అలలు
వాకాడు (తిరుపతి జిల్లా): వాతావరణంలో వచ్చిన మార్పులతో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో శనివారం అలలు 3 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. సముద్రంపై పో­రు గాలితోపాటు సుడులు తిప్పుతోంది. దీంతో తీర ప్రాంత గ్రా­మా­­ల మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది.

29న అండమాన్‌కు నైరుతినైరుతి రుతుపవనాలు ఈ నెల 29 నాటికి అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళా­ఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతా­వరణ శాఖ తెలిపింది. జూన్‌ 1వ తేదీకి కేరళను రుతు పవనాలు తాకుతాయని, ఆ తర్వాత 2, 3 తేదీల్లో ఏపీకి విస్తరిస్తాయని పేర్కొంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)