Breaking News

రైతు నోట రాని ట‘మాటా’

Published on Sun, 02/23/2025 - 05:31

పలమనేరు : ఉమ్మడి చిత్తూరు జిల్లా­లో­ని పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో టమాటా రైతులు ఎప్పటిలాగే ఈ ఏడాదీ నష్టాలు చవిచూస్తున్నా­రు. ధరలు భారీగా పతనమవడమే ప్రధా­న కారణం. పలమనేరు టమాటా మార్కెట్‌లో శనివారం 15 కి­లో­ల బాక్సు రూ.140 నుంచి రూ.150 వ­రకు పలికింది. అంటే.. కేజీ రూ.10 మాత్రమే. దీంతో భారీ పెట్టు­బడులు పెట్టి సాగుచేసిన రై­తు­లు లబోదిబోమంటున్నారు. 

మరోవైపు.. టమాట పండించే రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తె­లంగాణలోనూ సీజ­న్‌ మొదలవడంతో భారీగా టమాటాలు ఆయా రా­ష్ట్రాల మార్కెట్లకు చేరుతున్నాయి. అ­లాగే, పొరుగునే ఉన్న అనంతపు­రం సరుకు ఇక్కడి మార్కెట్లను ముంచెత్తుతోంది. దీంతో ధరలు అమాంతం పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. 

అయితే.. టమాట రైతును ఆదుకునేందుకు మార్కెటింగ్‌ శాఖ రెండ్రోజులుగా టమాటాను కొని రైతుబజార్లకు విక్రయిస్తున్నట్లు పైకి చెబుతున్నప్పటికీ నిజానికి ఎలాంటి సాయం చేయడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.  

రైతులను ఆదుకునేది ఇలాగేనా?
రాష్ట్రంలోని టమాటా రైతులను టీడీపీ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతుల నుంచి నేరుగా మార్కెటింగ్‌ శాఖ టమాటాలను కొంటుందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు చెప్పారు. కానీ, మార్కెటింగ్‌ అధికారులు మాత్రం శుక్రవారం మొక్కుబడిగా కొని శనివారం కొనలేదు. 

అలాగే, పలమనేరు మార్కెట్‌కు రోజుకి 40–50 టన్నుల టమాటాలు వస్తుంటే ఇక్కడి అధికారులు శుక్రవారం కొన్న సరుకు కేవలం మూడు టన్నులే. పైగా.. పలమనేరు మార్కెట్‌లో శనివారం బాక్సు టమాట (15 కిలోలు) రూ.150 పలికింది. అంటే.. కిలో రూ.10 అన్నమాట. కానీ, మార్కెటింగ్‌ అధికారులు కిలో రూ.8తో కొన్నారు. ఇలాగేనా రైతులను ఆదుకునేదని వారు ప్రశ్నిస్తున్నారు.

మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి.. 
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరా పొలంలో టమా­ట సాగుచేయా­లం­టే రూ.­1.20 లక్షలు పెట్టుబడిగా పెట్టాలి. పంట బాగా పండితే ఎకరానికి 800 బాక్సులు దిగుబడి రావచ్చు. ఇప్పుడున్న ధరతో రాబడి ఏముంటుంది నష్టాలు తప్ప? దీనికోసం మళ్లీ అప్పులు చేయాల్సిందే. టమాటకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.  
– మునివెంకటరెడ్డి, కూర్మాయి, పలమనేరు మండలం 

అంతా కొనడం కుదురుతుందా!? 
ఇక్కడి మార్కెట్‌లో కిలో రూ.8–రూ.10 రేటుతో మూడు టన్నులు కొని రైతుబజార్‌కు పంపాం. ఈ మార్కెట్‌కు నిత్యం 50 టన్నుల లోకల్‌ సరుకు, మరో 40 టన్నుల అనంతపురం సరుకు వస్తోంది. ఇదంతా కొనేందుకు కుదురుతుందా అని చూస్తున్నాం. అనంతపురం సరుకు తగ్గుముఖం పట్టగానే మార్చి 15 నుంచి ఇక్కడి సరుకు పెరుగుతుంది. అప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. – సంజీవకుమార్, ఏఏంసీ సెక్రటరీ, పలమనేరు  

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు