Breaking News

అరటి సాగులో ఆదర్శం

Published on Mon, 06/30/2025 - 04:04

సాగును భారంగా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ ఉద్యోగి పంటల సాగుపై మక్కువ పెంచుకున్నాడు. వృత్తి రీత్యా బెంగళూరులో   స్థిరపడినా... సొంతూరులోని పొలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు.   

పెనుకొండ: అరటి సాగులో సత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని మంగాపురం గ్రామానికి చెందిన గోపాలరెడ్డి వైవిధ్యాన్ని కనబరుస్తూ పలువురిని ఆకర్షిస్తున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆయన కుటుంబసభ్యులతో కలసి మహానగరంలోనే నివాసముంటున్నారు. అయితే వ్యవసాయంపై మక్కువ ఉన్న ఆయన తరచూ అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తూ గ్రామంలో తనకున్న 3.75 ఎకరాల్లో యాలక్కి రకం అరటి సాగు చేపట్టారు. ప్రస్తుతం కోత దశలో ఉన్న అరటి గెలలను బెంగళూరుకు చెందిన వ్యాపారులకు టన్ను రూ. 50 వేల చొప్పున విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు.  

రూ. 26 లక్షల ఖర్చు.. 
తన తమ్ముడి సహకారంతో యాలక్కి అరటి సాగులో అంతర్‌పంటగా వక్క, టెంకాయ చెట్లను గోపాలరెడ్డి పెంచుతున్నారు. ఈ క్రమంలో పొలం చుట్టూ ఫెన్సింగ్, బోరు వేయించడం, డ్రిప్‌ ఏర్పాటు, షెడ్‌ నిర్మాణం, వీడర్‌ కొనుగోలు, పొలం చదును, కూలీలు, ఇతర ఖర్చులు కలిపి దాదాపు రూ.26 లక్షల వరకూ వెచ్చించారు. కర్ణాటకలోని నెలమంగల సమీపంలో ఉన్న ఫ్రీన్‌లీ బనానా కంపెనీ నుంచి టిష్యూ కల్చర్‌ అరటి ఒక్కో మొక్కను రూ.30 చొప్పున,  శివమొగ్గ సమీపంలోని తీర్థహళ్లి నుంచి వక్క మొక్కలు, చెళ్లకెర నుంచి ఒక్కో టెంకాయ మొక్కను రూ.380తో కొనుగోలు చేశారు.  

మొత్తం 2,500 అరటి మొక్కలు, 1,800 వక్క, 110 టెంకాయ మొక్కలను ఒకేసారి పొలంలో నాటి సాగు చేపట్టారు. ప్రస్తుతం చేతికి అందివచ్చిన తొలిదశ అరటి పంటను విక్రయించగా రూ.3.50 లక్షల ఆదాయం సమకూరింది. మరో రెండు కోతల పంట చేతికి వచ్చే అవకాశముంది. అరటి పిలకలను విక్రయిస్తుంటారు. ఒక్కో పిలకను రూ.20 నుంచి రూ.25 చొప్పున కొనుగోలు చేసుకుని వెళుతుంటారు. అరటి ఆకులను బెంగళూరుకు తరలించి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం అరటి మొక్క బోద నుంచి లభ్యమయ్యే గడ్డను ఇతర రైతులు తీసుకెళ్లి తమ పొలాల్లో  పంట పెట్టుకుంటున్నారు. ఒక్కో గడ్డను రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు.

అవగాహనతోనే పంటల సాగు  
పంటల సాగుపై అనుభవం ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం బెంగళూరులో నివాసముంటూ భార్యతో కలసి ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నా. గ్రామంలో పెద్దల నుంచి సంక్రమించిన 3.75 ఎకరాల పొలాన్ని బీడుగా మార్చడం ఇష్టం లేక అరటి సాగు చేపట్టాను. భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంతర్‌ పంటగా వక్క, టెంకాయ చెట్లను పోషిస్తున్నా. వృద్ధురాలైన తల్లి, వికలాంగుడైన తమ్ముడు తోడుగా ఉంటున్నారు. పంట సాగులో రైతులెవరైనా    నా సహకారం కావాలనుకుంటే 974047 1698కు ఫోన్‌ చేసి       సలహాలు తీసుకోవచ్చు. – గోపాలరెడ్డి, రైతు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)