Breaking News

రికార్డు ‘కిక్‌’!

Published on Mon, 01/19/2026 - 04:10

సాక్షి, అమరావతి: సంక్రాంతి సీజన్‌లో టీడీపీ మద్యం సిండికేట్‌ పండుగ చేసుకుంది. మూడు బీర్లు.. ఆరు నిబ్బులుగా మద్యాన్ని ఏరులై పారించింది. ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లతోపాటు 75 వేలకుపైగా బెల్ట్‌ దుకాణాలు, కోడి పందేల బరులు, మట్కా జూదాల డెన్‌లు, బీచ్‌లు, వీధి వాడా విచ్చలవిడిగా బెల్ట్‌ దుకాణాలు నెలకొల్పి యథేచ్ఛగా దందాకు తెగబడింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎక్సైజ్‌ శాఖ చోద్యం చూస్తుండిపోయింది. ఫలితం.. మద్యం అమ్మకాల్లో చంద్రబాబు సర్కారు  కొత్త రికార్డులు సృష్టించింది. టీడీపీ మద్యం సిండికేట్‌ అడ్డగోలు దోపిడీని మరోసారి చాటిచెప్పిన మద్యం అమ్మకాల తీరు ఇలా ఉంది... 

రూ.3 వేల కోట్ల దిశగా.. 
సంక్రాంతి సీజన్‌లో మద్యం అమ్మకాల్లో ఏపీ కొత్త రికార్డులు సృష్టించింది. ఈ ఏడాది జనవరి 1వతేదీ నుంచి 17 వరకు రాష్ట్రంలో ఏకంగా రూ.1,797.57 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించడం గమనార్హం. మొత్తం 24.64 లక్షల మద్యం కేసులు, 11.36 లక్షల బీరు కేసులు విక్రయించారు. గతేడాది సంక్రాంతి సీజన్‌ సందర్భంగా జనవరి 1 నుంచి 17 మధ్య రూ.1,531.18 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మరో రూ.266.39 కోట్ల మేర అధికంగా మద్యం విక్రయాలు సాగాయి. ఇక ఈ నెలాఖరుకు మద్యం విక్రయాలు రూ.3 వేల కోట్ల మార్కును దాటుతుందని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది.  

టాప్‌లో తిరుపతి జిల్లా 
సంక్రాంతి సీజన్‌ మద్యం విక్రయాల్లో తిరుపతి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో అత్యధికంగా రూ.111.97 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. తరువాత స్థానాల్లో రూ.108.17 కోట్ల విక్రయాలతో విశాఖ జిల్లా రెండో స్థానంలో ఉంది. రూ.97.43 కోట్ల మద్యం విక్రయాలతో ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా మూడో స్థానంలో, రూ.91.91 కోట్ల అమ్మకాలతో ఎనీ్టఆర్‌ జిల్లా నాలుగో స్థానంలో ఉన్నాయి. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)