Breaking News

త్వరలో ఏలేరు–తాండవ ప్రాజెక్టుల అనుసంధానం

Published on Thu, 07/20/2023 - 04:22

నాతవరం (అనకాపల్లి జిల్లా): వర్షాకాలం తర్వాత ఏలేరు–తాండవ అనుసంధానం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్, గోదావరి డెల్టా సిస్టం చీఫ్‌ ఇంజనీర్‌ ఆర్‌.సతీష్ కుమార్‌ చెప్పారు. నాతవరం మండలం జిల్లేడుపూడిలో ఏలేరు సొరంగం వద్ద తాండవ ప్రాజెక్టు కాల్వలను ఉత్తర కోస్తా సీఈ ఎస్‌.సుగుణాకరరావుతో కలిసి బుధవారం ఆయ­న పరిశీలించారు. ఏలేరు, తాండవ ప్రాజెక్టుల అనుసంధానానికి ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు రూ.470 కోట్ల 5 లక్షలను కేటాయించి  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నంలో పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం రిజర్వాయర్‌ నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్, జీవీఎంసీ, ఇక్కడి పరిశ్రమలకు రోజుకు 95 జీఎండీల నీరు సరఫరా అవుతోంది. అనుసంధానం పనులు ప్రారంభించడానికి నీటి సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు నీటిపారుదల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు.

అనంతరం ఏలేరు, తాండవ ప్రాజెక్టు అధికారులతో పా­టు జీవీఎంసీ, విస్కో అధికారులకు అనుసంధానం పనులపై ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సతీష్­కుమార్‌ దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టు పనులను రూ.1,100 కోట్లతో పూర్తి చేస్తున్నామని ఉత్తర కోస్తా సీఈ ఎస్‌.సుగుణాకరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వంశధార ప్రాజెక్టు లిఫ్ట్‌ పనులు రూ.150 కోట్లతో జరుగుతున్నాయన్నారు. హిరమండలంలో బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.

రూ.123 కోట్లతో విజయనగరం జిల్లా తోటపల్లి బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ పనులు చేస్తున్నామన్నారు. తారకరామ రిజర్వాయర్‌తో పాటు పలు ప్రాజెక్టులకు మరమ్మ­తులు చేస్తున్నామని వివరించారు. ధవళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ జి.శ్రీనివాసరావు, ఈఈ భాస్కరరావు, డీఈ వినోద్‌కుమార్, విస్కో సలహాదారు, విశ్రాంత ఎస్‌ఈ జగన్మోహన్‌రావు, తాండవ ప్రాజెక్టు డీఈ జె.స్వామినాయుడు, జేఈలు శ్యామ్‌కుమార్, వినయ్‌కుమార్, ఆర్‌.పాత్రుడు, రామకృష్ణ, నాగబాబు సిబ్బంది పాల్గొన్నారు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)