Breaking News

బాలుడి అవయవదానం.. ఇద్దరికి ప్రాణదానం

Published on Mon, 04/24/2023 - 04:15

శ్రీకాకుళం రూరల్‌/అక్కిరెడ్డిపాలెం/తిరుపతి తుడా(తిరుపతి జిల్లా)/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి సారిగా ఓ బ్రెయిన్‌ డెడ్‌ విద్యార్థి నుంచి అవయవాలు సేకరించారు. జిల్లా కేంద్రంలోని రాగోలు జెమ్స్‌ ఆస్పత్రిలో అవయవదానం కార్యక్రమం ఆదివారం జరిగింది. సోంపేట మండలం గీతామందిర్‌ కాలనీకి చెందిన విద్యార్థి మళ్లారెడ్డి కిరణ్‌చంద్‌(16)కు బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో మెదడులోని నరాలు చిట్లి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. విద్యార్థి తల్లిదండ్రులు మోహన్, గిరిజాకల్యాణిల అంగీకారంతో అవయవాలు సేకరించారు.

కిరణ్‌చంద్‌ ఈ నెలలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. చివరి పరీక్ష ముందు రోజు రాత్రి తీవ్ర జ్వరం, తలనొప్పితో మంచానపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సీటీ స్కాన్‌ చేసిన వైద్యులు మెదడులోని నరాలు ఉబ్బినట్లు గుర్తించారు. వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కిరణ్‌చంద్‌ మెదడులోని నరాలు చిట్లిపోయాయని, ఎక్కడకు తీసుకెళ్లిన బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చి చెప్పేశారు. దీంతో కిరణ్‌చంద్‌ తల్లిదండ్రులు శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్‌ ఆస్పత్రికి వారం రోజుల కిందట తమ కుమారుడిని తీసుకొచ్చారు.

మోహన్, గిరిజాకల్యాణి దంపతులకు కిరణ్‌ ఒక్కడే కుమారుడు. అలాంటిది బిడ్డకు ఈ పరిస్థితి రావడంతో వారు చూసి తట్టుకోలేకపోయారు. ఏపీ జీవన్‌దాన్‌ సంస్థ ఆధ్వర్యంలో అవయవాలు దానం చేయొచ్చని, అవి వేరే వారికి ఉపయోగపడతాయని తెలుసుకు­న్నారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను మరో ఐదుగురికి అందిస్తే వారిలో తమ కుమారుడిని సజీవంగా చూసుకుంటామని వైద్యులకు చెప్పడంతో.. ఆదివారం రాగోలు జెమ్స్‌ ఆస్పత్రి వైద్యులంతా కలిసి అవయవాల తరలింపునకు శ్రీకారం చుట్టారు.

గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేసి ఒక పైలెట్, ఎస్కార్ట్‌ ద్వారా అవయవాల తరలింపునకు జెమ్స్‌ ఆస్పత్రి వైద్యులు ఏర్పాట్లు చేశారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను ఆపరేషన్‌ చేసి తీశాక, ముందుగా గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన అవయవాలను విశాఖ­లోని ఇతరత్రా ఆస్పత్రులకు పంపిస్తామని జెమ్స్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ చెప్పారు.  

యువకుడికి కిడ్నీ, లివర్‌
కిరణ్‌చంద్‌ అవయవాలను గ్రీన్‌ చానల్‌ ద్వారా అంబులెన్స్‌లో విశాఖకు చేర్చారు. ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 4.20 గంటలకు చేరుకోగా.. వెంటనే విశాఖలోని కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రిలోని ఓ యువకుడికి కిడ్నీ, లివర్‌ను అమర్చి ప్రాణం పోశారు. 

దిగ్విజయంగా చిన్నారికి గుండె మార్పిడి
వైద్య రంగంలో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికకు తిరుపతి శ్రీ పద్మావతి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌లోని వైద్యులు గుండె మార్పిడిని విజయవంతంగా పూర్తిచేశారు. నాలుగు నెలల వ్యవధిలోనే ఆస్పత్రిలో వరుసగా ముగ్గురికి గుండె మార్పిడి చికిత్సను నిర్వహించారు. కిరణ్‌చంద్‌ నుంచి గుండెను వేరుచేసి గ్రీన్‌ చానల్‌ ద్వారా విశాఖ విమానాశ్రయానికి, అక్కడి నుంచి విమా­నంలో రేణిగుంట విమానాశ్ర­యానికి తీసుకొచ్చారు.

అక్కడి నుంచి 27 నిమి­షాల్లో శ్రీపద్మావతి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌కు ప్రత్యేక అంబులెన్స్‌ ద్వారా తరలించారు. ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్‌ గణపతి బృందం ఐదేళ్ల చిన్నారికి గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి బాలికకు గుండెను అమర్చారు. తిరుపతి జిల్లా, తడ మండలం, రామాపురంలో నివసిస్తున్న అన్బరసు, గోమతి దంపతులకు ఇద్దరు పిల్లలు.

మొదట జన్మించిన చిన్నారి రీతిశ్రీ పుట్టుకతోనే గుండె బలహీనతతో జన్మించింది. వైద్య పరీక్షలు నిర్వహించి గుండె మార్పిడి అనివార్యమని వైద్యులు నిర్ధారించారు. చెన్నై ఎగ్మోర్‌ ఆస్పత్రిలో సంప్రదించగా, కొన్ని రోజుల చికిత్స అనంతరం తిరుపతిలోని టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌కు వెళ్లాలని వైద్యులు సూచించడంతో నాలుగు నెలల కిందట ఇక్కడ చేరారు. 

వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం  
గుండె మార్పిడి అనివార్యం కావడంతో రీతిశ్రీ తల్లిదండ్రులు ఇటీవల సీఎంవో కార్యాలయంలో సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిశారు. తమ బిడ్డ పరిస్థితిని, మెడికల్‌ రిపోర్టులను అందజేశారు. పరిశీలించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. గంటల వ్యవధిలోనే ఆరోగ్యశ్రీ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయించారు.

గుండె మార్పిడి చికిత్సకు రూ.20 లక్షలు ఖర్చవుతుండటంతో మరో రూ.10 లక్షలను టీటీడీ సమకూర్చింది. మొత్తం రూ.20 లక్షలతో చిన్నారి కుటుంబానికి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగానే ఖరీదైన వైద్యాన్ని అందించారు. ఆరోగ్యశ్రీనే తమ బిడ్డను కాపాడిందని, సీఎం జగనన్నకు తాము రుణపడి ఉంటామని రీతిశ్రీ తల్లిదండ్రులు అన్బరసు, గోమతిలు కన్నీళ్లపర్యంతమయ్యారు.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)