Breaking News

5వ తరగతి వరకు స్మార్ట్‌టీవీలతో పాఠాలు 

Published on Sat, 10/07/2023 - 04:32

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడం ద్వారా వారిని ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని సర్కార్‌ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం వారికి డిజిటల్‌ బోధనను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా తొలి దశ నాడు–నేడు స్కూళ్లలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు 30,213 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ)లను అమర్చింది. అలాగే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూళ్లలో 10,038 స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేసింది.   

తరగతి గదుల డిజిటలైజేషన్‌లో భాగంగా.. 
ఇక ఇప్పుడు నాడు–నేడు కింద రెండో దశ స్కూళ్లలో కూడా ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్, స్మార్ట్‌ టీవీల ఏర్పాటు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా 1 నుంచి 5వ తరగతి వరకు డిజిటలైజేషన్‌లో భాగంగా తరగతి గదుల్లో 28,014 స్మార్ట్‌ టీవీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. 65 ఇంచులు గల స్మార్ట్‌ టీవీల కొనుగోలుకు ఓపెన్‌ కాంపిటీటివ్‌ బిడ్స్‌ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించాలని విద్యా శాఖ నిర్ణయించింది.

వీటి కొనుగోలుకు రూ.100 కోట్ల కన్నా ఎక్కువ వ్యయం అవుతుండటంతో నిబంధనల మేరకు ఓపెన్‌ కాంపిటీటివ్‌ బిడ్‌ టెండర్‌ డాక్యుమెంట్‌ను జ్యుడిíÙయల్‌ ప్రివ్యూకు పంపింది. ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 9 వరకు సమర్పించడానికి గడువు విధించింది. అనంతరం జ్యుడిషియల్‌ ప్రివ్యూ సూచనల మేరకు ఓపెన్‌ కాంపిటీటివ్‌ బిడ్ల కోసం టెండర్లను ఆహ్వానించనుంది.  

లోపాలుంటే 24 గంటల్లోపే పరిష్కారం 
1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి 60 మంది పిల్లలకు ఒక స్మార్ట్‌ టీవీ ఏర్పాటు చేసి వాటి ద్వారా బోధించనున్నారు. డిసెంబర్‌ నాటికల్లా వీటి ఏర్పాటు పూర్తి చేయనున్నారు. స్కూళ్లకు స్మార్ట్‌ టీవీలను తీసుకువచ్చి అమర్చిన నాటి నుంచి ఐదేళ్ల వారంటీ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది.

స్మార్ట్‌ టీవీలను సరఫరా చేసిన తరువాత నెల రోజుల్లోనే వాటి పనితీరులో లోపాలున్నా, సంతృప్తికరంగా పనిచేయకపోయినా వాటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంటుంది. అలాగే వాటిలో ఏమైనా లోపాలుంటే.. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా పరిష్కరించాలి. ఒకవేళ స్మార్ట్‌ టీవీ కొత్తది అమర్చాలంటే మూడు రోజుల్లోపే అమర్చాలనే నిబంధన విధించింది. అదేవిధంగా సేవల కోసం కాల్‌ సెంటర్‌ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)