Breaking News

భక్తులకు అలర్ట్‌.. శ్రీశైలంలో చిరుత కలకలం

Published on Fri, 01/02/2026 - 07:13

సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలంలో చిరుతపులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది. పాతాళ గంగ మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి చిరుతపులి వచ్చింది. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం సిబ్బంది. అప్రమత్తమయ్యారు. పుణ్య స్నానాలకు వెళ్ళే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అధికారులు అనౌన్స్ చేయిస్తున్నారు.

నల్లమలలో 87 పెద్ద పులులు
నల్లమల అడవుల్లో ప్రస్తుతం 87 పెద్దపులులు ఉన్నట్లు ఎన్‌ఎస్‌టీఆర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రాన్ని గురువారం పునఃప్రారంభించారు. అలాగే శ్రీకామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నల్లమలలో ప్రస్తుతం 87పెద్ద పులులు ఉండగా త్వరలో పులుల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు.

మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రాన్ని గతంలో మహానందీశ్వరస్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు, పర్యాటకులు సందర్శించేవారని, అనివార్యకారణాలతో ప్రవేశం నిలిపేసినట్లు తెలిపారు. గురువారంనుంచి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పర్యాటకులు ఉచితంగా పర్యావరణ కేంద్రాన్ని సందర్శించవచ్చునన్నారు. అటవీ జంతువులపై అవగాహన కల్పించేలా చిత్రాలు ఏర్పాటు చేశామన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)