Breaking News

మేము చెప్పినట్లు జరగాల్సిందే

Published on Wed, 09/25/2024 - 05:31

సాక్షి, అమరావతి: విద్యుత్‌ సంస్థల్లో తాము చెప్పినట్లే బదిలీలు జరగాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. దీంతో గడువు ముగిసినప్పటికీ గత్యంతరం లేక పాత తేదీలతో అధికారులు బదిలీలు చేస్తున్నారు. ఈ శాఖలో బదిలీలకు ముందే ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు బయటకు రావడంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు నేతల సిఫారసులు ఉన్నప్పటికీ, కనీస అర్హత ఉన్న ఉద్యోగుల బదిలీలలనే ఆమోదించారు. 

ఆ మేరకు కొందరికి పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. అలాగే రాజకీయ నేతల కోరిక మేరకు కొందరిని బదిలీ చేసినప్పటికీ డిప్యూటేషన్‌ పేరుతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగేలా ఆదేశాలిచ్చారు. అయినా తృప్తి పడని కొందరు నేతలు ఇంకా ఒత్తిళ్లు తేవడంతో విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు వారిచ్చిన బదిలీలను సైతం పాత తేదీలతో మార్చి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

బదిలీలకు ఈ నెల 22వ తేదీతో గడువు ముగిసినప్పటికీ, ఇప్పటికీ కొనసాగు­తున్నాయి. ఏపీఈపీడీసీఎల్‌లో ఆరుగురు డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను నిలిపివేసి, కొత్త పోస్టింగ్‌లతో మంగళవారం మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)