Breaking News

పోసానిపై పోలీసుల ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌

Published on Sun, 03/02/2025 - 07:55

సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో అరెస్ట్‌ చేసిన దగ్గర్నుంచి చివరకు రిమ్స్‌ ఆస్పత్రి తరలించే విషయంలోనూ పోలీసుల వైఖరి ‘పచ్చ’ పగను బట్టబయలు చేస్తోందని హైకోర్టు న్యాయవాది జల్లా సుదర్శన్‌రెడ్డి చెప్పారు. పోలీసుల తీరు నిజమైన ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌గా చెప్పవచ్చని అన్నారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పోసానిపై 15 కేసులు పెట్టారని, ఆశ్చర్యకరంగా 15వ కేసులో మాత్రమే అరెస్ట్‌ చేశా­రని తెలిపారు.

పోసాని అరోగ్య సమస్యలను ఆయన, కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించి, మరునాడు ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించుకోవాల్సి ఉందని చెప్పినా, పోలీసులు వినిపించుకోకుండా అరెస్టు చేశారని తెలిపారు. తమ వద్ద మంచి డాక్టర్లు ఉన్నారంటూ పోసానిని జీపు ఎక్కించుకుని తీసుకెళ్లిన సంబేపల్లి పోలీసులు.. తెల్లారేవరకు జీపులోనే తిప్పుతూ తీవ్రంగా ఇబ్బంది పెట్టారన్నారు. మరునాడు మధ్యాహ్నం ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడ 9 గంటలపాటు విచారించారని తెలిపారు.

కోర్టుకు తరలించే ముందు పీహెచ్‌సీ వైద్యులతో పరీక్షలు చేయించారని, గొంతు, చేయి నొప్పితో ఉన్న ఆయనకు బీపీ, షుగర్‌ చెక్‌ చేసి కోర్టుకు తరలించారని తెలిపారు. రెండు రాత్రిళ్లు నిద్ర, ఆహారం లేకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నారు. రాజంపేట జైలులో ఛాతి నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, అయినా మధ్యాహ్నం వరకు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా వేధింపులకు గురి చేశారని తెలిపారు. ఈసీజీలో హార్ట్‌ బీట్‌ తేడా కనిపించడంతో కడప రిమ్స్‌కు తరలించారన్నారు. అప్పుడూ ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన్ని అంబులెన్స్‌లో కాకుండా పోలీస్‌ వ్యాన్‌లో తరలించడం దారుణమని, వేధింపులకు పరాకాష్ట అని చెప్పారు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)