Breaking News

ఇప్పుడు బాల్కనీలోనే... సౌర విద్యుత్‌

Published on Fri, 08/22/2025 - 02:58

సాక్షి, అమరావతి: కరెంటు బిల్లుల మోత నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్‌ అవసరాలను తీర్చుకునే మార్గాల అన్వేషణ నిరంతరం జరుగుతోంది. ఆ క్రమంలోనే భానుడి కాంతి కిరణాలను విద్యుత్‌ శక్తిగా మార్చే సౌర ఫలకల వాడకం పెరుగుతోంది. అయితే విస్తరిస్తున్న పట్టణీకరణ కారణంగా వెలుస్తున్న బహుళ అంతస్తుల భవంతులపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు పరిమితులు అడ్డంకులుగా మారుతున్నాయి. 

వివిధ అంతస్తుల్లో నివాసం ఉండే వారికి సౌర విద్యుత్‌ సరఫరా అందని ద్రాక్షగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు తాజాగా బాల్కనీలే వేదికగా ‘ప్లగ్‌ ఇన్‌’ సౌర ఫలకలు అందుబాటులోకి వస్తున్నాయి.  ఖర్చు, అమర్చడం, నిర్వహణ పరంగా  చూస్తే  ఇవి సరికొత్త ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తున్నాయి. 

సులువైన ప్రత్యామ్నాయం 
విశాఖపట్నంలో ఓ హోటల్‌ యజమాని ఐదంతస్తుల భవనం మొత్తం గోడలను సౌర ఫలకలతో నింపేశారు. ఇది ఒక సోలార్‌ ప్యానల్‌ ఎలివేషన్‌తో నిర్మాణం జరిగిన ఫుల్‌ ఎకో గ్రీన్‌ హోటల్‌.  ప్లగ్‌ ఇన్‌ ప్యానెల్స్‌ను అపార్ట్‌మెంట్లు, భవనాల బాల్కనీలో ఏర్పాటు చేసుకుని నేరుగా ఇంటిలోని ఇన్వర్టర్‌కి ప్లగ్‌ చేసుకోవచ్చు. 

అంటే సౌర ఫలక నుంచి నేరుగా ఒకే ఒక వైరు ద్వారా విద్యుత్‌ సరఫరాను పొందవచ్చు. దీనికి ఎలాంటి ప్రభుత్వ, సాంకేతిక అనుమతులు కూడా అవసరం లేదు. బాల్కనీ పొడవును బట్టి, సౌర ఫలకలు అమర్చేందుకు ఉన్న వెసులుబాటును బట్టి, ఎన్ని ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోగలిగితే అంత ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు.  

సూర్య కిరణాలే... భవన విద్యుత్‌ వెలుగులు 
దేశం మొత్తం మీద వాడే విద్యుత్‌లో భవనాల్లో వినియోగం మూడవ వంతు కంటే ఎక్కువ.  దేశ వ్యాప్తంగా 2027 నాటికి రూ.75,021 కోట్లతో సోలార్‌ రూఫ్‌ టాప్‌ సిస్టమ్‌లు కోటి ఇళ్లకు అమర్చాలనే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ పథకాన్ని 2024 ఫిబ్రవరిలో ప్రారంభించింది. 2024–25 కోసం రూ.13,175.33 కోట్లను కేటాయించింది. కానీ ఇప్పటి వరకూ కేవలం 16.15 లక్షల గృహాలపై మాత్రమే రూఫ్‌టాప్‌ పెట్టగలిగింది. అదే బాల్కనీలో ప్లగ్‌ ఇన్‌ సౌర ఫలకలు ఏర్పాటు చేయగలిగితే నగరాలు, పట్టణాల్లోని అన్ని అపార్ట్‌మెంట్లలో సౌర విద్యుత్‌ వెలుగులు విరజిమ్మే అవకాశం ఉంది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)