Breaking News

మరుపురాని మహోన్నత నేత రాజన్న

Published on Wed, 09/03/2025 - 04:17

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: మహానేత, దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వి­దేశాల్లో  నా­య­కులు, అభిమానులు, ప్రజలు ఆ­య­న­­కు ఘ­నంగా నివాళులర్పించారు. మరుపు­రాని మహో­న్న­త నేత అని కొనియాడారు. వాడ­వాలా ఆయన విగ్రహాలు, చిత్రపటాల వద్ద పు­ష్పాంజలి ఘటించారు. జోహార్‌ వైఎస్సార్‌.. వైఎ­స్సార్‌ అమర్‌రహే అన్న నినాదాలు ఊరూరా ప్రతి­ధ్వనించాయి. తె­లంగాణ, కర్ణాటక, తమిళ­నాడు, ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లోను, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూ­జిలాండ్‌ దేశాల్లోని వివిధ రాష్ట్రా­ల్లోను వైఎస్సార్‌ వర్ధంతిని నిర్వహించారు. 

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ­లు, ఇతర ప్రజాప్ర­తి­నిధులు, వైఎస్సార్‌సీపీ నేత­లు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నేత­లు, ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమాల్లో పలుచోట్ల అన్నదానం, వస్త్రదానం, రక్తదానం చేశారు. వృద్ధా­శ్రమాలు, అనాథ శరణా­లయాలు, ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు. పేదలకు దుప్పట్లు అందజేశారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశా­రు. 

పలుచోట్ల వైద్యశిబి­రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర­మాలను స­మానంగా ముందుకు తీసుకెళ్లి, పరిపా­లనలో సమానత్వాన్ని చాటుకుంటూ ప్రజల హృద­యాల్లో చెరగని ముద్ర వేసుకుని పాలకుడంటే ఎలా ఉండాలో చాటి­చెప్పారని ప్రజలు, వైఎస్సా­ర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రవాసాంధ్రులు స్మరించుకున్నారు. 

» వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద పలువురు నివాళుల­ర్పించారు. పలు ప్రాంతాల నుంచి బస్సులు, ఇతర వాహనాల్లో సోమ­వారం రాత్రి­కే ఇడుపు­లపాయ చేరుకున్నారు. సమాధిపై పూ­ల­మాలలుంచి మహానేతను స్మరించుకున్నారు.  
»  కువైట్‌లోని మాలియా ప్రాంతంలోని పవన్‌ ఆంధ్ర రెస్టారెంట్‌లో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  
»  ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎ­స్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. రూరల్‌ అగ్రికల్చర్‌ డెవల­ప్‌మెంట్‌ సొసైటీ అధ్యక్షుడు బి. మదన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో అభి­మానులు వైఎస్సార్‌ చిత్రపటా­నికి పూలమా­లలు వేసి ’వైఎస్సార్‌ అమర్‌ రహే’ నినాదాలు చేశారు. వైఎస్సార్‌కు భారత­రత్న ఇవ్వాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతి­పాదించాలని కోరారు.  ఇంద్రప్రస్థ తెలుగు అసోసి­యేషన్‌ ప్రధాన కార్యదర్శి బి. కోటిరెడ్డి, తెలుగు క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
» అలాగే, దక్షిణాఫ్రికా లోని జొహనెస్‌బర్గ్‌లోని కమ్యూనిటీ సెంటర్‌ బేకరీలో రూ.5 లక్షల విలువైన వస్త్రాలు, ఆహార ధాన్యాలను ప్రవాసాంధ్రులు పంపిణీ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)