Breaking News

సాగర గర్భంలో 'స్వదేశీ' సింహం

Published on Thu, 01/01/2026 - 04:43

సాక్షి, విశాఖపట్నం : దేశ రక్షణ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ,  హిందూ మహాసముద్ర జలాల్లో ఆధిపత్యం చెలాయించే దిశగా భారత నౌకాదళం సరికొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే వరుస క్షిపణి ప్రయోగాలతో దూసుకెళ్తోన్న నౌకాదళం తాజాగా మరో అడుగు ముందుకేసింది. శత్రు దేశాల గుండెల్లో గుబులు రేపేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నాలుగో ‘బాహుబలి’ బాలిస్టిక్‌ క్షిపణి జలాంతర్గామి (ఎస్‌ – 4 స్టార్‌) సిద్ధమవుతోంది. 

విశాఖపట్నంలోని షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో నిర్మితమవుతున్న 7 వేల టన్నుల బరువున్న ఈ జంబో సబ్‌మెరైన్‌ రెండు రోజుల క్రితం సీ ట్రయల్స్‌ కోసం సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెసల్స్‌ (ఏటీవీ) ప్రాజెక్టులో ఈ సబ్‌మెరైన్‌ ఒక కీలక మైలురాయిగా మారనుంది. 

2027 జనవరిలో నౌకాదళ అమ్ముల పొదిలోకి.. 
» అరిహంత్‌ క్లాస్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ సబ్‌మెరైన్‌ శ్రేణిలో ఇదే చివరిది. అందుకే గత మూడు జలాంతర్గాముల కంటే భిన్నంగా భారీగా తయారు చేస్తున్నారు. 
» భారత నౌకాదళంలో ప్రస్తుతం షిప్‌ సబ్‌మెర్సిబుల్‌ బాలిస్టిక్‌ న్యూక్లియర్‌(ఎస్‌ఎస్‌బీఎన్‌)లు నాలుగున్నాయి. ఇందులో ఇప్పటికే రెండు సబ్‌మెరైన్‌లు నౌకాదళంలో సేవలందిస్తున్నాయి.  
» మూడో సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ అరిథామన్‌ సీ ట్రయల్స్‌ పూర్తి చేసుకుంది. 2026 చివర్లో సేవలందించేందుకు సిద్ధమవుతోంది. 
» ఈ సబ్‌మెరైన్ల నిర్మాణం కోసం 1984లో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెస్సెల్‌ (ఏటీవీ) ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేశారు.  
» గతంలో నిర్మించిన 3 సబ్‌మెరైన్లలో 60 నుంచి 75 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించగా, ఈ ఎస్‌–4 స్టార్‌ జలాంతర్గామిని 80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. 
»  తొలివిడత సీ ట్రయల్స్‌ పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయని... మరో మూడు విడతల్లో పూర్తి చేసిన తర్వాత 2027 జనవరిలో విధు­ల్లో చేరనుందని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.  

అరిహంత్‌ క్లాస్‌లో అదరగొట్టే సబ్‌మెరైన్‌ 
»    మొదటి ఎస్‌ఎస్‌బీఎన్‌ అయిన అరిహంత్‌ క్లాస్‌ సబ్‌మెరైన్‌ నిర్మాణం 1998లో మొదలైంది. 
»   అదే సంవత్సరం పోఖ్రాన్‌లో అణ్వాయుధాలను భారత్‌ పరీక్షించింది. 
»    అరిహంత్‌ 2016 నుంచి సేవల్లో చురుగ్గా ఉంది. 
»    రెండో సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ను 2024 ఆగస్టు 29న జాతికి అంకితం చేశారు. 
»    అరిథామన్‌ 2026లో నౌకాదళంలో చేరనుంది.  
»    వీటన్నింటికంటే భిన్నంగా శత్రు దేశాలకు భయం పుట్టించేలా భారీగా ఎస్‌–4 స్టార్‌ సబ్‌మెరైన్‌ తయారు చేశారు. 
»   మొదటి మూడు సబ్‌మెరైన్లు 110 మీటర్ల పొడవు, 6 వేల టన్నుల బరువుతో తయారు చేశారు. ఇవి 16 కే, 
15 ఎస్‌ఎల్‌బీఎంలని లేదా కే–4 బాలిస్టిక్‌ మిసైల్స్‌ని నాలుగింటిని మాత్ర­మే తీసుకెళ్లగలవు. కొత్తగా తయారు చేసిన ఎస్‌–4 స్టార్‌ సబ్‌మెరైన్‌ మాత్రం 120 మీటర్ల పొడవు, 7 వేల టన్నుల బరువుతో నిర్మితమైంది. ఇది ఏకంగా 8 కే–4 బాలిస్టిక్‌ మిసైల్స్‌ని తీసుకెళ్లే సామ­ర్థ్యంతో డిజైన్‌ని విస్తరించారు.

ఎస్‌ – 5 క్లాస్‌కు  తొలి మెట్టుగా 
»  అరిహంత్‌ క్లాస్‌ తర్వాత భారీ సబ్‌మెరైన్లు నిర్మించేందుకు భారత నౌకాదళం ప్రణాళికలు రూపొందించింది. 
»    ఎస్‌–5 ప్రాజెక్టుగా 5 జలాంతర్గాములు తయారు చేయనున్నారు. 
»    దీనికి ఎస్‌ – 4 స్టార్‌ సబ్‌మెరైన్‌ నిర్మాణం తొలి మెట్టుగా భావిస్తున్నారు. 
»    ఎందుకంటే రాబోయే జలాంతర్గాముల్ని రెట్టింపు బరువుతో అంటే ఏకంగా 13,500 టన్నుల భారీ సామర్థ్యంతో నిర్మించాలని భావిస్తున్నారు. 
»    2030 నాటికి ఎస్‌ – 5 ప్రాజెక్టులో తొలి సబ్‌మెరైన్‌ సేవలు అందించనుందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. 
»    మొత్తానికి విశాఖ తీరం వేదికగా జరుగుతున్న ఈ పరిణామాలు, హిందూ మహాసముద్రంలో చైనా వంటి దేశాల కదలికలకు చెక్‌ పెట్టే దిశగా భారత్‌ వేస్తున్న బలమైన అడుగులుగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)