Breaking News

అద్విక ట్రేడింగ్‌ మోసం రూ.144 కోట్లు

Published on Wed, 10/29/2025 - 05:50

లబ్బీపేట(విజయవాడతూర్పు): అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి రూ.144 కోట్ల మేర మోసానికి పాల్పడిన అద్విక ట్రేడింగ్‌ కంపెనీకి చెందిన నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు మంగళవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ నగరానికి చెందిన తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య, అతని భార్య సుజాత 2022లో అద్విక ట్రేడింగ్‌ కంపెనీ స్థాపించారు. తొలుత రూ.15 లక్షల పెట్టుబడితో దుబాయిలో ఉన్న కబానా అకౌంట్‌ ద్వారా ట్రేడింగ్‌ ప్రారంభించారు. 

మొదట్లో పెద్దగా లాభాలు రాలేదు. డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఆదిత్య, సుజాతతోపాటు బాదంశెట్టి బాలకృష్ణమూర్తి, నాగలక్ష్మీకుమారి కలిసి అధిక లాభాలు, వడ్డీలు ఆశ చూపించి కొందరు ఏజెంట్ల ద్వారా డిపాజిట్ల సేకరణ ప్రారంభించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు 2023లో భారీగా అద్విక ట్రేడింగ్‌ కంపెనీ వార్షికోత్సవం నిర్వహించారు. దాదాపు 1,450 మంది నుంచి రూ.400 కోట్లు వరకు డిపాజిట్ల రూపంలో వసూలు చేశారు. 

కొందరు డిపాజిటర్లకు వడ్డీతో సహా తిరిగి చెల్లించారు. ఎక్కువ భాగం డిపాజిట్లను మల్టీ బ్యాంక్‌ గ్రూప్‌నకు బదిలీ చేశారు. కొంత మొత్తాన్ని విదేశీ ప్లాట్‌ఫామ్‌లకు బదిలీ చేశారు. తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య, అతని భార్య సుజాత పేరుతో చరాస్తులు, బంగారం కోనుగోలు చేశారు. కొత్తగా సేకరించిన డిపాజిటర్ల డబ్బులు పాతవారికి చెల్లించేవారు. కొంతకాలానికి డిపాజిటర్లకు డబ్బులు చెల్లించలేని స్థితికి చేరుకుని పారిపోయారు.  

వెలుగులోకి ఇలా... 
అద్విక ట్రేడింగ్‌ కంపెనీలో డిపాజిట్‌ చేస్తే మోసం చేశారంటూ వీరమల్లు గణేష్ చంద్ర ఈ ఏడాది జూన్‌ 26న మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులు రూ.53 లక్షలు డిపాజిట్‌ చేస్తే, రూ.13 లక్షలు తిరిగి చెల్లించారని, మిగిలినవి ఇవ్వకుండా మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పది పోలీసు బృందాలు విచారణ చేపట్టాయి. అద్విక ట్రేడింగ్‌ కంపెనీ 1,450 మంది నుంచి రూ.400 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించినట్లు తేలింది. అందులో కొందరికి తిరిగి చెల్లించగా, 1,355 మందికి రూ.135 కోట్లు చెల్లించాలని పోలీసులు నిర్ధారించారు. 

25 మంది ఏజెంట్లకు రూ.9 కోట్లు చెల్లించకుండా మోసం చేసినట్లు తేలింది. నిందితుల వద్ద చరాస్తులు, బంగారం రూ.100 కోట్లు వరకు ఉన్నట్లు గుర్తించారు. తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య, సుజాత, గాదంశెట్టి బాలకృష్ణమూర్తి, నాగలక్ష్మీకుమారిని విజయవాడ రామవరప్పాడు బల్లెంవారి వీధిలో ఉన్న లక్ష్మి ఎంక్లేవ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.23 లక్షల నగదు, 580 గ్రాముల బంగారం, 8.30 కిలోల వెండి, కారు, కంప్యూటర్లు స్వా«దీనం చేసుకున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)