Breaking News

బొలిశెట్టి వ్యాఖ్యలపై దుమారం

Published on Wed, 09/18/2024 - 04:52

విశాఖ సిటీ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులను అవమానిస్తూ జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేంద్రం తీసు­కున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ 1,314 రోజులుగా స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటాలు దొంగ ఉద్యమాలని బొలిశెట్టి వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. 

‘దుకాణాల మాదిరిగా టెంట్లు వేసుకుని కూర్చున్న వారు పవన్‌కళ్యాణ్‌ను ఎందుకు కలవలేదని, వారిని చాచిపెట్టి కొట్టాల’న్న బొలిశెట్టి వ్యాఖ్యలపై కార్మికులు, ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ స్టాండా? అని ప్రశ్నిస్తున్నారు. అదే వారి విధానమైతే తాము స్టీల్‌ప్లాంట్‌ కోసమే కాకుండా.. జనసేన పార్టీకి వ్యతిరేకంగా కూడా ఉద్యమిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

ఆ వ్యాఖ్యలు పట్టించుకోం
కార్మిక సంఘాల ఉద్యమాల వల్లే ప్రైవే­టీకరణ ఇంతకాలం ఆగిందని బహిరంగ సభలో పవన్‌­చెప్పారు. బొలిశెట్టి జనసేన­లో ఉంటూ బాధ్యతా­రహితంగా మాట్లాడుతూ ఆ పార్టీ పరువు తీస్తున్నారు. – డి.ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి, స్టీల్‌ ఏఐటీయూసీ

క్షమాపణ చెప్పాలి
ఉద్యమాన్ని నీరు­గార్చే ప్రయ­త్నం ఇది. ఏనాడూ బొలిశెట్టి కార్మికు­ల ఉద్యమంలో పాల్గొ­నలేదు. ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలి. దమ్ముంటే టెంట్‌ వద్దకు వచ్చి ఆ మాట చెప్పాలి. – రాజశేఖర్,  ప్రధాన కార్యదర్శి, స్టీల్‌ ఐఎన్‌టీయూసీ

సంఘాల వల్లే ప్రైవేటీకరణ ఆగింది
కార్మిక సంఘాలు ఉండబట్టే ఇప్పటి­వరకు ప్రైవేటీ­కర­ణ ఆగింది. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ సీఐ­టీయూ పోరాటాల వల్ల ఆగింది తప్ప.. పవన్‌కళ్యాణ్‌ వల్ల కాదు. ఈ విషయా­లేవీ బొలిశెట్టికి తెలియదేమో.   – యు.రామస్వామి, ప్రధాన కార్యదర్శి, స్టీల్‌ సీఐటీయూ

విమర్శలు అర్థరహితం
స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాలపై జనసేన నేత బొలిశెట్టి సత్య­నారాయణ చేసిన విమర్శలు అర్థరహితం. జనసేన అధికారంలోకి వచ్చాకే కార్మిక సంఘాలు మంచివి కావని ఆయనకు తెలిసిందా.   – వై.మస్తానప్ప, ప్రధాన కార్యదర్శి, స్టీల్‌ వైఎస్సార్‌టీయూసీ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)