Breaking News

ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌కు కార్మిక శాఖ నోటీసు

Published on Sat, 01/06/2024 - 04:18

పలమనేరు(చిత్తూరు జిల్లా): తాను ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ చానెల్‌లో 20 ఏళ్లు విలేకరిగా వెట్టిచాకిరి చేశానని, కనీసం జీతం కూడా ఇవ్వకుండా తనను తొలగించారని, ఈ మేరకు సంస్థపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేశానని ఆర్‌ఎస్‌ లోకనాథం అనే వ్యక్తి శుక్రవారం తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... పలమనేరు పట్టణానికి చెందిన ఆర్‌ఎస్‌ లోకనాథం 20 ఏళ్లు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ చానల్‌లో పనిచేశారు.

ఇటీవల చానల్‌లోని పలువురిని కుదించి పలమనేరు రిపోర్టరే మూడు నియోజకవర్గాలను కవర్‌ చేయాలని ఆదేశించారు. దీంతో లోకనాథం కారు అద్దెకు తీసుకుని ముఖ్యమైన కార్యక్రమాలను కవర్‌ చేశారు. ఇందుకు సంబంధించిన అద్దె బిల్లులను బ్రాంచ్‌ మేనేజర్‌ పెట్టుకుని డబ్బు డ్రా చేసుకోవడంతో కడుపుమండిన బాధితుడు తమ యాజమాన్యం పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు.

అయితే లోకనాథంపైనే ఆగ్రహం వ్యక్తంచేసి ఆయన్ను విధుల నుంచి తొలగించారు. దీనిపై బాధితుడు తిరుపతిలోని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ (డీసీఎల్‌) బాబూనాయక్‌కు గత నెల 22న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీసీఎల్‌ గత నెల 30వ తేదీన ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)