లేబర్‌ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలి

Published on Sun, 05/11/2025 - 05:51

కృష్ణలంక(విజయవాడతూర్పు): కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్‌ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని మధ్య తరగతి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు డిమాండ్‌ చేసింది. విజయవాడలో శనివారం ఈ సదస్సు జరిగింది. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని, కనీస వేతనం రూ.26 వేలు, కనీస పెన్షన్‌ రూ.10 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని సదస్సు డిమాండ్‌ చేసింది. 

జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాల రద్దుతో పాటు ఇతర డిమాండ్లతో ఈ నెల 20న దేశ వ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు. సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

కార్పొరేట్‌కు వత్తాసు పలికేందుకే లేబర్‌ కోడ్‌.. 
మధ్యతరగతి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వినర్‌ ఆర్‌.అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరపకుండా కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను దొడ్డిదారిన తీసుకుకొచి్చందన్నారు. లేబర్‌ కోడ్‌ అమల్లోకి వ­స్తే ఇప్పుడున్న అనేక హక్కులను కార్మికులు, ఉద్యోగులు, కోల్పోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. 

బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నా­యకుడు వై.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయా­లని డిమాండ్‌ చేశారు. సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ ఇన్సూ్య­రెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ సంయుక్త కార్యదర్శి జి.కిశోర్‌కుమార్, బెఫీ నాయకుడు ఎస్‌.వి.రమణ, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకుడు ఎల్‌.కృష్ణబాలాజీ, విద్యుత్‌ సంఘం రాష్ట్ర నాయకుడు ఎల్‌.రాజు, బ్యాంక్‌ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు నర్సింహం, బీమా ఉద్యోగ సంఘం నాయకుడు కళాధర్‌ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)