Breaking News

కృష్ణాలోకి కెమికిల్‌!

Published on Mon, 12/01/2025 - 05:48

దాచేపల్లి: కృష్ణానదిలో ప్రమాదకర రసాయనాల తెట్టు ప్రజలను కలవర పెడుతోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ, ఏలియంపేట గ్రామాల వద్ద కృష్ణానదిలో ఇటీవల భారీగా రసాయనాల తెట్టుని స్థానికులు గుర్తించారు. నీటిపై రంగురంగులుగా రసాయనాల తెట్టు తేలియాడుతూ దిగువకు వెళుతోంది. కొన్నిచోట్ల నది ఒడ్డుకు వచ్చి పేరుకుపోయింది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో నదిలోని నీరు రంగు మారిపోయింది.

రకరకాల రంగులు, కెమికల్స్‌ కలిసి ఉండటంతో ఆ తెట్టు పేరుకుపోయిన ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వస్తోంది. తెట్టు ఉన్న ప్రాంతంలో నీటిని పట్టుకుంటే చేతులు మంటలు వస్తున్నాయని నదిలో వేటకు వెళ్తున్న మత్స్యకారులు చెబుతున్నారు. దాచేపల్లి మండల పరిధిలో ఉన్న కెమికల్, సిమెంట్‌ పరిశ్రమల నుంచి రసా­యనాల వ్యర్థాలు తెచ్చి నదిలో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ నీటిని తాగితే ప్రాణాలు పోతా­యని భయాందోళనలకు గురవుతున్నారు.

ఆ నీరే ప్రజలకు సరఫరా 
కృష్ణానది నుంచి తంగెడ గ్రామంలోని సుమారు 6వేల మంది ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ ద్వారా నదిలో నీటిని పంపింగ్‌ చేసి పైపుల ద్వారా ట్యాంకుల్లో నింపి అక్కడ నుంచి కుళాయిల ద్వారా తాగునీటిని ఇళ్లకు సరఫరా చేస్తారు. కొద్ది రోజులుగా కృష్ణానదిలో రసాయనాల తెట్టు ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు ఆ నీటినే ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కృష్ణానది ఒడ్డునే ఏలియంపేట గ్రామం ఉంది.

 ఇక్కడున్న 50 కుటుంబాలవారు నదిలో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరు పూర్తిస్థాయిలో కృష్ణానది నీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు నదిలోని నీటిని తాగుతున్న వారంతా తమకు ఏమవుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు కృష్ణానదికి అవతలి వైపు ఉన్న తెలంగాణలోని కొన్ని గ్రామాల వెంట కూడా నదిలో ఈ రసాయనాల తెట్టు కనిపిస్తోంది.

అధికారుల ఆరా... నది నుంచి నీటి సరఫరా నిలిపివేత  
కృష్ణానది నీటిలో రసాయనాలు కలవటంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎక్కడ నుంచి అయినా రసాయనాలు తెచ్చి ఇక్కడ నదిలో వదిలేశారా? దాచేపల్లి మండల పరిధిలో ఎక్కువగా ఉన్న కెమికల్, సిమెంట్‌ పరిశ్రమల వారే వ్యర్థ రసాయనాలను నదిలో కలిపేశారా? అనే దానిపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. మూడు విభాగాల అధికారులు ఆదివారం తంగెడ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. గ్రామానికి నది నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. గ్రామంలోని బోర్ల ద్వారా నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)