Breaking News

కృష్ణా, గోదావరి ఉగ్రరూపం

Published on Fri, 08/22/2025 - 02:11

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/ విజయపురిసౌత్‌: వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను దాటి నదులు ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,40,756 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పది గేట్ల ద్వారా 4,85,435 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. 

నాగార్జునసాగర్‌లోకి 4,32,268 క్యూసెక్కులు చేరుతుండగా, 4.28 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 4,28,513 క్యూసెక్కులు చేరుతుండగా 4,13,205 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 5,08,849 క్యూసెక్కులు చేరుతుండగా, కృష్ణా డెల్టాకు 8 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 5 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

పోలవరం నుంచి 11,09,200 క్యూసెక్కులు..
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులోకి 11,09,200 క్యూసెక్కులు చేరుతుండటంతో ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి అంతేమొత్తంలో దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 11,74,573 క్యూసెక్కులు చేరుతుండగా, గోదావరి డెల్టాకు 9,100 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 11,65,473 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

ఉత్తరాంధ్రలోని వంశధార, నాగావళిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 13,495 క్యూసెక్కులు చేరుతుండగా, అంతే  సముద్రంలోకి వదిలేస్తున్నారు. నారాయణపురం ఆనకట్ట మీదుగా నాగా­వళి వరద జలాలు 9,400 క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)