Breaking News

రంజిత కేసులో వీడిన మిస్టరీ.. నిందితుడు ఎవరంటే?

Published on Sun, 11/09/2025 - 12:01

సాక్షి, అంబేద్కర్ కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం బాలిక మృతి కేసులో మిస్టరీ వీడింది. చిన్నారి రంజిత అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు. వేలిముద్రల ఆధారంగా రంజితను శ్రీను చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధిత కుటుంబానికి నిందితుడు తెలిసిన వ్యక్తి కావడం గమనార్హం.

కోనసీమ జిల్లాలో ఈ నెల నాలుగో తేదీన చిన్నారి రంజిత అనుమానాస్పద మృతిచెందిన విషయం తెలిసిందే. ఈకేసులో కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. తాజాగా పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా రంజితది హత్యగా నిర్ధారించారు. అయితే, రంజిత ఉంటున్న ఇంటి కింద గదిలో కోటి అనే యువకుడు ఇంటర్నెట్ షాప్ నిర్వహిస్తున్నారు. కోటికి యూట్యూబ్ చానల్లో పని చేస్తున్న కోటి స్నేహితుడు.  శ్రీను రెగ్యులరుగా కోటి షాప్ దగ్గరికి వస్తూ ఉండేవాడు.

అయితే, తాను ఇంట్లో లేని సమయంలో రంజితకు కావాల్సిన వస్తువులను తనకు ఇవ్వాల్సిందిగా శ్రీనుకి చిన్నారి తల్లి సునీత చెప్పింది. ఈ క్రమంలో ఫ్యాన్ రిపేర్ అయిందని ఇంటికి వచ్చిన శ్రీను.. చున్నీ మెడకు బిగించి రంజితను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. తనపై అనుమానం రాకుండా విచారణకి వచ్చిన పోలీసులతో అతడు తిరిగినట్లు సమాచారం. అలాగే, లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో నిందితులను త్వరగా పట్టుకోవాలని శ్రీను మేసేజ్‌లు కూడా పెట్టినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని నిర్థారించిన అనంతరం, ఘటనా స్థలంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కూడా చేసినట్టు తెలిసింది. కాసేపట్లో జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)