Breaking News

‘హమ్మయ్యా!’ ఆ ఆరుగురు దొరికారు

Published on Sat, 03/29/2025 - 14:15

అంబేద్కర్ కోనసీమ జిల్లా, సాక్షి:  ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్‌ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. ఐదురోజుల తర్వాత.. శనివారం ఆ పిల్లల ఆచూకీ శనివారం లభ్యమైంది. తల్లిదండ్రులు మందలించారనే వాళ్లు అలా వెళ్లిపోయినట్లు సమాచారం.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా­లోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ నెల 24వ తేదీన స్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదు. బడి, ఇల్లు తప్ప ఏం తెలియని చిన్నారులు అలా కనిపించకుండా పోయేసరికి అంతా ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించి.. బంధువులను ఆరా తీసి చివరకు స్థానిక పోలీసులను అశ్రయించారు.

ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. వాళ్లంతా బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలోనే చదువుతున్నారు. స్థానికుల సాయంతో పోలీసులు చుట్టుపక్కల గాలించారు. వాళ్ల ఫొటోలను మీడియాలో, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.  డ్రోన్ సాయంతో పరిసర ప్రాంతాల్లో అన్వేషించారు. నాలుగు రోజులైనా ఆచూకీ తెలియరాకపోవడంతో అంతా కంగారుపడ్డారు.

చివరకు పి.గన్నవరం మండలం పెదమాల లంకలో మొక్కజొన్న రైతులకు  విద్యార్థులు కనిపించారు. అయితే వాళ్లు ఆకలితో ఉండడంతో భోజనం పెట్టి పంపించి వేశారు. ఈ క్రమంలో సిద్ధాంతం వద్ద ఉన్న లంకలో బాలబాలికను గుర్తించిన పోలీసులు చివరకు ఆలమూరుకు తరలించారు. తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)