కోనసీమ జిల్లాలో ONGC గ్యాస్‌ లీక్‌.. మరో 24 గంటలు ఆందోళన

Published on Mon, 01/05/2026 - 17:17

సాక్షి,ఇరుసుమండ: కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ గ్యాస్‌లీకేజీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గ్యాస్‌లీకేజీపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. లీకైన గ్యాస్‌ను అదుపు చేసేందుకు  మరో 24 గంటల సమయం పడుతుందని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 1993 నుంచి ఆపరేషన్‌లో ఉన్న వెల్‌లో ఈ బ్లో అవుట్ చోటుచేసుకుంది. 2024లో ‘డీప్’ అనే కంపెనీకి సబ్ లీజ్ ఇచ్చారు. 2,500 మీటర్ల లోతులో ఒక లేయర్‌లో ఎక్స్ప్లోరేషన్ ప్రయత్నం జరుగుతుండగా, అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ తన్నుకొచ్చింది. ఒక గంట పాటు గ్యాస్ మాత్రమే బయటికి వచ్చింది. మధ్యాహ్నం 12.30 గంటలకు మంటలు చెలరేగాయి. వెల్‌లో 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజల భద్రత కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఓఎన్జిసి ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. వెల్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకోవడానికి కనీసం మరో 24 గంటలు పట్టే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.

ఇరుసుమండ బ్లో అవుట్ పై ఓఎన్జిసి ప్రకటన చేసింది. ‘గ్యాస్ లీక్ ఘటనలో ఎవరూ చనిపోలేదు, ఎవరికి  గాయాలు కాలేదు. రిమోట్ ఏరియాలో ఎలాంటి నివాస ప్రాంతాలు లేవు. గ్యాస్ లీక్ ప్రాంతంలో కూలింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాం. క్రైసిస్ మేనేజ్మెంట్ టీములను మొబలైజ్ చేశాం. పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరమైతే గ్యాస్ బావిని మూసివేస్తాం.

అంతర్జాతీయ నిపుణులతో సమన్వయం చేసుకొని, అధునాతన వ్యవస్థతో నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఓఎన్జిసి సీనియర్ మేనేజ్మెంట్ సాంకేతిక ని పనులు పరిస్థితిని నిషితంగా అంచనా వేస్తున్నారు. అవసరమైన అదనపు పరికరాలు నర్సాపురం సహా ఇతర ప్రాంతాల నుంచి పంపిస్తున్నాము’అని తెలిపింది. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)