Breaking News

సీఎం జగన్‌కు కోనసీమ బ్రహ్మరథం 

Published on Sat, 08/12/2023 - 04:08

సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కోనసీమలో మహిళలు, యువకులు బ్రహ్మరథం పట్టారు. అమలాపురం రూరల్‌ జనుపల్లిలో శుక్రవారం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.  

అమలాపురం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్‌ దూరం ఉన్న జనుపల్లిలోని స్టేడియం సభాస్థలికి చేరుకోవడానికి అరగంటకు పైగా పట్టింది. అడుగడుగునా ప్రజలు జైజగన్‌ నినాదాలు చేస్తుండగా.. వారందరికీ అయన అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు. ప్రాంగణం బయట, రోడ్లపైన జనం బారులు తీరారు. అమలాపురం, ఎర్రవంతెన–నల్లవంతెన మార్గం తిరునాళ్లను తలపించింది.  

బాధితులకు సీఎం ఓదార్పు..  
తాడేపల్లి తిరిగి వెళ్లే సమయంలో హెలిప్యాడ్‌ వద్ద బాధితులు సీఎం జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వికలాంగులు, వృద్ధులు, అభాగ్యులు, అనారోగ్యంతో బాధపడుతున్న సుమారు 146 మంది విన్నపాలను సీఎం జగన్‌ రెండు గంటలపాటు ఎంతో ఓపికగా ఆలకించారు. తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను ఆదేశించారు. వారంతా భోజనం చేయలేదని తెలుసుకుని, వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

అంతకు ముందు సీఎం జగన్‌ అమలాపురం–బెండమూర్లంక మధ్య రూ.17.44 కోట్లతో 8 కిలోమీటర్ల రోడ్డు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. బెండమూర్లంక ఓహెచ్‌ఆర్‌సీ ట్యాంకు నుంచి ఓఎన్జీసీ ప్లాంట్‌ వరకు రూ.7.62 కోట్ల ఓఎన్జీసీ సీఎస్‌ఆర్‌ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి, సాంఘిక సంక్షేమ నిధులు రూ.12.16 కోట్లతో అంబేడ్కర్‌ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.      

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)