Breaking News

చిత్తడి నేలలు.. పర్యావరణ నేస్తాలు

Published on Thu, 02/13/2025 - 05:39

కైకలూరు: ఉపరితలంపై ఏడాది పొడవునా ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండే భూములను చిత్తడి నేలలు అంటారు. ఇవి జీవరాశుల మనుగడకు అనువైనవి. ఇరాన్‌లోని రామ్‌సర్‌ నగరంలో 1971 ఫిబ్రవరి 2న నిర్వహించిన అంతర్జాతీయ చిత్తడి నేలల సదస్సులో ప్రపంచవ్యాప్తంగా వీటి ఆవశ్యతను గుర్తించారు. 

దేశవ్యాప్తంగా 23 రాష్ట్రల్లో 85 రామ్‌సర్‌ సైట్లలో 13,688.0903 హెక్టర్లలో చిత్తడి నేలలు ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 3,719.08 హెక్టర్లలో విస్తరించి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే చిత్తడి నేలలగా రామ్‌సర్‌ గుర్తించిన ఏకైక కొల్లేరు సరస్సు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వ్యాపించి ఉంది. 

కొల్లేరు నిలయం 
కొల్లేరు ప్రాంతంలో 2,22,689 ఎకరాల విస్తీర్ణాన్ని 2002 ఆగస్టు 19న రామ్‌సర్‌ సైట్‌గా గుర్తించారు. చిత్తడి నేలల నిలయమైన కొల్లేరుకు ఆస్ట్రేలియా, నైజీరియా, ఈజిప్టు, ఇండోనేషియా వంటి దేశాల నుంచి వలస పక్షులు విడిదికి వస్తున్నాయి. ప్రపంచ పెలికాన్‌ పక్షుల్లో 40 శాతం శీతాకాలంలో కొల్లేరుకు రావడానికి చిత్తడి నేలలే కారణం. కొల్లేరులో దాదాపు 182 రకాల పక్షులు సంచరిస్తున్నాయి. 

కృష్ణా, గోదావరి, తుంగభద్ర, కావేరి, హిమాలయాలు వంటి ప్రాంతాల్లో సరస్సులు, మడ అడవులు, పరీవాహక ప్రాంతాలు చిత్తడి నేలల కోవలోకి వస్తాయి. ఈ ఏడాది ‘భవిష్యత్తు కోసం చిత్తడి నేలలను రక్షించడం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు చేపడు తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 56.25 హెక్టార్లు పైగా విస్తీర్ణంలో 1,943 చిత్తడి నేలలు 3,719.08 చరుపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. 
  
ప్రమాదంలో చిత్తడి నేలలు 
ఇంటర్‌ గవర్నమెంటల్‌ సైన్స్‌–పాలసీ ప్లాట్‌ఫాం ఆన్‌ బయోడైవర్సిటీ అండ్‌ ఎకో సిస్టమ్‌ సర్వీసెస్‌ (ఐపీబీఈఎస్‌) గ్లోబల్‌ అంచనా ప్రకారం చిత్తడి నేలలు అడువుల కంటే మూడు రెట్లు వేగంగా కనుమరుగవుతున్నాయి. చిత్తడి నేలలు భూ ఉపరితలంపై 6 శాతం మాత్రమే ఉన్నా మొత్తం వృక్ష, జంతు జాతులలో 40 శాతం చిత్తడి నేలల్లోనే నివసిస్తున్నాయి. 

అడవుల నరికివేత, రసాయనాల వాడకం, ఆక్రమణలు వల్ల చిత్తడి నేలలు సహజత్వాన్ని కోల్పోతున్నాయి. కొల్లేరు సరస్సులో ఆక్రమణలను మూడు నెలల్లో తొలగించాలని సుప్రీంకోర్టు రాష్ట్రం ప్రభుత్వానికి ఆదేశించడానికి కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం కావడమే ప్రధాన కారణం. 
 

చిత్తడి నేలలు.. ఉపయోగాలు  
» వరదలను నియంత్రిస్తాయి. 
»  ఫిల్టర్‌ మాదిరిగా నీటిని శుద్ధి చేస్తాయి. అందుకే వీటిని ప్రకృతి మూత్ర పిండాలుగా వర్ణిస్తారు.  
»మట్టిలోని ఉత్పాదక సారాన్ని పెంచుతాయి.  
»సున్నితమైన ప్రకృతి వనరులతో పాటు, జీవరాశులన్నింటికీ అనువైన వాతావరణం.  
»  ఔషధ గుణాలున్న మొక్కల పెరుగుదలకు తోడ్పడతాయి.  
»  రసాయనిక, జెనెటిక్‌ పదార్థాలను ఇముడ్చుకుని, తిరిగి నేలను మార్పు చేస్తాయి.  
»   అత్యధిక జీవరాసులకు ప్రధాన ఆవాస కేంద్రంగా ఉంటాయి.  
» ఎక్కువ కాలం నీటి నిల్వకు, భూమి లోపలి నీటి శాతాన్ని పెంచేందుకు దోహదపడతాయి.  
» సున్నితమైన ప్రకృతి వనరులకు, పక్షులకు నిలయాలుగా ఉన్నాయి. 
» చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత అని రామ్‌సర్‌ సదస్సు పిలుపునిచ్చింది. 

పరిరక్షణ అందరి బాధ్యత  
చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరును పరిరక్షించుకోవడం అందరి బాధ్యత. కొల్లేరు ప్రాంతానికి ఈ ఏడాది ఎక్కువగా వలస పక్షులు వచ్చాయి.    –బి.విజయ, జిల్లా అటవీశాఖ అధికారి, ఏలూరు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)